Nagarjuna: బిగ్ బాస్ ద్వారా నాగ్ సంపాదించిందెంతో తెలుసా..?

Nagarjuna: బుల్లితెర రియాల్టీ షో గా భారీ పాపులారిటీ దక్కించుకున్న బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికే పలు భాషలలో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ షో తెలుగులో కూడా ఏడు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఇకపోతే ఈ షో ఇంతలా సక్సెస్ అవ్వడంలో హోస్ట్ కూడా ఒక పాత్ర పోషించారని చెప్పాలి. ఈ క్రమంలోనే తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 కి ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరించగా, సీజన్ 2 కి నాని హోస్టుగా చేశారు. ఇక ఆ తర్వాత సీజన్ 3 నుంచి సీజన్ 7 వరకు అక్కినేని నాగార్జున హోస్టుగా చేస్తున్నారు. అయితే నాగార్జున బిగ్ బాస్ షో ద్వారా ఇప్పటివరకు ఎన్ని కోట్లు సంపాదించారు అనేది చాలా హాట్ టాపిక్ గా మారింది.

ఇకపోతే బుల్లితెర కార్యక్రమంలో బిగ్ బాస్ షో కి ఎంత క్రేజ్ ఉందో అదేవిధంగా చాలా ట్రోల్స్.. ఇప్పుడు కేసులు కూడా నమోదు అవుతున్నాయి. ఇలాంటి రియాల్టీ షో వల్ల చాలామంది సెలబ్రిటీలుగా మారుతున్నప్పటికీ కూడా కొన్ని వివాదాల వల్ల బిగ్ బాస్ షో పై నెగిటివిటీ ఏర్పడింది. ఇకపోతే ఈ షో లో సెలబ్రిటీలే కాదు .. సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకున్న వారికి కూడా ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే అతి త్వరలోనే బిగ్ బాస్ ఓటీటీ రెండవ సీజన్ కూడా ప్రారంభం కాబోతోంది. అందుకు కూడా హోస్ట్ గా నాగార్జుననే వ్యవహరిస్తున్నట్లు సమాచారం. మరి ఇన్ని సీజన్లకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున బిగ్ బాస్ ద్వారా భారీగానే సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇండస్ట్రీలో తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ షో ద్వారా ఇప్పటివరకు అక్కినేని నాగార్జున ఏకంగా రూ.140 కోట్లకు పైగా సంపాదించారని సమాచారం. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ వార్త కాస్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. సినిమాలలో కంటే బిగ్ బాస్ షో వల్ల నాగార్జున భారీగా సంపాదించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా బిగ్ బాస్ షో ద్వారా ఈ రేంజ్ లో సంపాదించడం ఒక రికార్డు అని చెప్పవచ్చు.

- Advertisement -

ఇకపోతే బిగ్ బాస్ కాన్సెప్ట్ తనకి నచ్చకపోయినా సరే నాగార్జున హోస్ట్ గా వ్యవహరించడానికి కారణం పారితోషకం అని చాలామంది చెబుతున్నారు. ఇక నాగార్జున విషయానికి వస్తే.. ప్రస్తుతం నా సామిరంగా అనే సినిమాతో సంక్రాంతి బరిలో పోటీకి దిగబోతున్నారు. ఈ సినిమాతో ప్రముఖ కొరియోగ్రాఫర్ బెన్నీ విజయ్ దర్శకుడిగా మారుతున్నారు.. ఇందులో ప్రముఖ యంగ్ బ్యూటీ ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటిస్తుండగా.. రాజ్ తరుణ్, అల్లరి నరేష్ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు