Kalyan ram: కళ్యాణ్ రామ్ ని చీట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్..!!

Kalyan ram: నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ డెవిల్. ప్రీ ఇండిపెండెన్స్ పీరియాడిక్ అండ్ ఇన్వెస్టిగేటివ్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాకు అభిషేక్ నామ నిర్మాతగా, దర్శకుడిగా వ్యవహరించారు. డిసెంబర్ 29న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఓకే అనే టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ మొత్తం బాగానే ఉంది. ఇంటర్వెల్ సీన్స్ కూడా చాలా అద్భుతంగా తెరకెక్కించారు. అయితే క్లైమాక్స్ మాత్రం అంతగా బాలేదనే టాక్ వచ్చింది.

క్లైమాక్స్ అంతగా ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమాకి యావరేజ్ అనే టాక్ వచ్చింది. ఇక ఈ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించింది. నిజానికి హీరోయిన్ పాత్ర కోసం కళ్యాణ్ రామ్ ముందుగా సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ని అనుకున్నారట. ఈ పాత్రకి ఆమె అయితే బాగా సూట్ అవుతుందని భావించారట. ఈ విషయాన్ని ఆమెను అప్రోచ్ అయి చెప్పగా.. ఇలాంటి పాత్ర తాను చేయలేనని నిర్మొహమాటంగా చెప్పేసిందట.

అంతేకాదు రెమ్యూనరేషన్ హై ఇస్తామని చెప్పినా కూడా ఒప్పుకోలేదట. దీంతో చేసేదేమీ లేక కళ్యాణ్ రామ్ చాలామంది హీరోయిన్లని సంప్రదించి.. ఆ తర్వాత సంయుక్త మీనన్ ని చూస్ చేసుకున్నారు. ఈ న్యూస్ ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. సంయుక్త మీనన్ పాత్రలో ఈ చిత్రంలో మృణాలు ఠాకూర్ నటించి ఉంటే సినిమా ఇంకా బాగా హిట్ అయి ఉండేదని.. ఆ పాత్రకి ఆమె బాగా సూట్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు