Devara: వీడిని ఎవడన్నా ఆపండ్రా… స్టోరీ మొత్తం లీక్ చేస్తున్నాడు

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ “దేవర” మూవీకి సంబంధించిన ఎలాంటి న్యూస్ బయటకు వచ్చినా ఇట్టే వైరల్ అయిపోతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సోషల్ మీడియాలో “దేవర” మూవీ స్టోరీని లీక్ చేస్తూ ఓ నటుడు ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్ గా మారింది. వీడియోలో ఆయన కామెంట్స్ చూసిన తారక్ అభిమానులు రేయ్ వీడిని ఎవడన్నా ఆపండ్రా… స్టోరీ మొత్తం లీక్ చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియా వేదికగా తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ అతను లీక్ చేసిన “దేవర” స్టోరీ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

ఎన్టీఆర్ కథానాయకుడిగా, జాన్వి కపూర్ హీరోయిన్ గా, కొరటాల శివ దర్శకత్వంలో తాజాగా రూపొందుతున్న భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ “దేవర” ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. 2024 ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను సైలెంట్ గా పూర్తి చేస్తున్నారు చిత్ర బృందం. ప్రస్తుతం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా విదేశాలకు వెళ్లిన ఎన్టీఆర్ తిరిగి రాగానే మళ్లీ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.

ఒకవైపు ఇప్పటికే సముద్ర తీరాన ఉండే ఓ రాయల్ ఫ్యామిలీ నరరూప రాక్షసుల వంటి కొంతమంది విలన్ల నుంచి తీర ప్రాంత ప్రజలను కాపాడే బాధ్యతను తీసుకుంటారని, అప్పటిదాకా అజ్ఞాతంలో ఉన్న ఆ రాయల్ ఫ్యామిలీకి చెందిన వారసుడు రంగంలోకి దిగి, విలన్ల భరతం పడతాడని, ఆ మృగాల మధ్య పెరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడని ప్రచారం జరుగుతుంది. ఇక ఈ సినిమాలో జాన్వి కపూర్ పాలు అమ్మే యువతిగా కనిపించబోతుందని సమాచారం.

- Advertisement -

ఈ నేపథ్యంలోనే తాజాగా “దేవర” మూవీలో సపోర్టింగ్ రోల్ లో నటిస్తున్న ఓ వ్యక్తి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన కీలకమైన అంశాలను వెల్లడించారు. 2024లో రాబోతున్న బ్లాక్ బస్టర్ మూవీ “దేవర” అవుతుంది. ఈ మూవీలో దాదాపుగా 60 రోజులు పని చేశాను. హీరో వెకేషన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత జనవరి 15 నుంచి షూటింగ్ రీస్టార్ట్ కాబోతుందని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా సినిమాలో తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ శ్రీకాంత్ పక్కనే ఉంటానని చెప్పుకొచ్చాడు. అక్కడితో ఆగకుండా శ్రీకాంత్, సైఫ్ అలీ ఖాన్, “దసరా” విలన్ చాకో వీళ్లంతా ఫ్రెండ్స్, ఒక టీం అంటూ కీలక అంశాన్ని వెల్లడించాడు.

ఈ మూవీలో జాన్వి కపూర్ శ్రీకాంత్ కూతురుగా కనిపించబోతోంది అంటూ మెయిన్ ట్విస్ట్ రివీల్ చేసి షాక్ ఇచ్చాడు. దీంతో సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించి, ఇంట్రెస్ట్ తగ్గించే ఈ వీడియోను ఎవరైనా ఆపండి అంటూ తారక్ అభిమానులు నెట్టింట్లో మొరపెట్టుకుంటున్నారు. రేయ్ ఎవడ్రా నువ్వు… ఇంక స్టోరీ మొత్తం చెప్పేయ్ అంటూ ఫైర్ అవుతున్నారు. మరి “దేవర” టీం ఈ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు