2024 Movies list : 2024 సినిమాల లిస్ట్, రిలీజ్ డేట్స్

2024 Movies list : మరికొన్ని గంటల్లో న్యూ ఇయర్ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది రిలీజ్ కాబోతున్న చాలా సినిమాలపై ఇప్పటినుంచే అంచనాలు మొదలైపోయాయి. వచ్చే ఏడాది మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి పాన్ ఇండియా హీరోల సినిమాలు వరుసగా రిలీజ్ కాబోతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ లో ఎప్పుడో కన్ఫర్మ్ చేసేసారు మేకర్స్. ఇక ఈ సినిమాతో పాటు 2024లో రిలీజ్ చేయడానికి ఛాన్స్ ఉన్న అన్ని తేదీలను అప్పుడే లాక్ చేసి పెట్టుకున్నారు. ఈ ఏడాది “సలార్” మూవీ వల్ల మిడ్ రేంజ్ సినిమాలు రిలీజ్ డేట్ లో విషయంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. కానీ వచ్చే ఏడాది మాత్రం చివరి వరకు అన్ని రిలీజ్ డేట్ ల పై ముందే కర్చీఫ్ వేసి కూర్చున్నారు మేకర్స్. మరి 2024 మొదటి నుంచి ఇయర్ ఎండింగ్ వరకు రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్, వాటి రిలీజ్ డేట్స్ ఏంటి? ఎవరెవరు ఏ తేదీలలో తమ సినిమాలను రిలీజ్ చేయబోతున్నారు? అన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

2024 రిలీజ్ కానున్న సినిమాలు, వాటి రిలీజ్ డేట్స్ :
సర్కారు నౌకరి – జనవరి 01
గుంటూరు కారం – జనవరి 12
హనుమాన్ – జనవరి 12
కెప్టెన్ మిల్లర్ – జనవరి 12
అయాలాన్ – జనవరి 12
మెర్రీ క్రిస్మస్ – జనవరి 12
సైంధవ్ – జనవరి 13
ఈగిల్ – జనవరి 13
నా సామి రంగ – జనవరి 14
ప్రతినిధి 2 – జనవరి 25
రజాకార్ – జనవరి 26

తంగలన్ – జనవరి 26
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ – ఫిబ్రవరి 02
కిస్మత్ – ఫిబ్రవరి 02
యాత్ర 2 – ఫిబ్రవరి 08
టిల్లు స్క్వేర్ – ఫిబ్రవరి 09
ఊరు పేరు భైరవకోన – ఫిబ్రవరి 09
ఆపరేషన్ వాలెంటైన్ – ఫిబ్రవరి 16
మదమే వెబ్ సిరీస్ – ఫిబ్రవరి 16
డూన్ 2 – మార్చి 01
డబుల్ ఇస్మార్ట్ – మార్చ్ 08
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి – మార్చ్ 08
ఘన్ను భాయ్ – మార్చ్ 08
కుంగ్ ఫూ పాండా 4 – మార్చ్ 29
దేవర – ఏప్రిల్ 05
కంగువ – ఏప్రిల్ 11/12
గాడ్జిల్లా x కాంగ్ – ఏప్రిల్ 12
బాడ్ బాయ్స్ 4 – జూన్ 14
డెడ్ పూల్ 3 – జూలై 26
పుష్ప 2 – ఆగస్టు 15
క్రావెన్: ది హంటర్ – ఆగస్ట్ 30
ముఫాసా: ది లయన్ కింగ్ – డిసెంబర్ 30

- Advertisement -

ప్రస్తుతానికి 2024 ఇయర్ అండ్ దాకా కలిసి వచ్చే రిలీజ్ డేట్లను ముందుగానే ఎవరికి వారు ఖరారు చేసి పెట్టుకున్నారు. ఇక ముందు ముందు పరిస్థితుల వల్ల ఈ సినిమాలేమైనా పోస్ట్ పోన్ అవుతాయా అనేది చూడాలి. ఇక వచ్చే ఏడాది రిలీజ్ కాకుండా సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ విషయానికి వస్తే గుంటూరు కారం, దేవర, గేమ్ చేంజర్, పుష్ప వంటి సినిమాలు లిస్టులో ఉన్నాయి. ఇక కొత్త ఏడాది ముందుగా రిలీజ్ అయ్యే పెద్ద సినిమాల్లో “గుంటూరు కారం” ఒకటి. ఈ సినిమాకు పోటీగా ఏకంగా మరో నాలుగు సినిమాలు సంక్రాంతికి రంగంలోకి దిగబోతున్నాయి. మరి ఈ సంక్రాంతి విన్నర్ ఎవరు అనే విషయం తెలియాలంటే మరొక 12 రోజులు వెయిట్ చేయాల్సిందే.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు