Kollywood : తెరపైకి మరో స్టార్ హీరో విడాకులు?

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో రూమర్స్ అడ్డు అదుపు లేకుండా వస్తున్నాయి. “పలానా స్టార్ హీరోయిన్.. ఓ వ్యాపార వేత్తతో ప్రేమలో ఉంది. పలానా హీరో, ఓ స్టార్ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడు. ఒక ప్రముఖ నటుడు తన భార్యతో విడాకులు తీసుకుంటున్నాడు” అంటూ వచ్చే రూమర్స్ సంఖ్య లెక్క లేదు. సదరు హీరోలు, హీరోయిన్స్ మనోభావాలను లెక్క చేయకుండా.. ఇలాంటి వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ రూమర్స్ ను స్వయంగా నటీ నటులు ఖండించినా, అవి ఆగడం లేదు.

తాజాగా కోలీవుడ్ లో ఒక రూమర్ అభిమానులను తెగ టెన్షన్ పెట్టించింది. అదేంటంటే..? “కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దలపతి తన భార్య సంగీతతో డైవర్స్ తీసుకోబోతున్నాడట” ఈ వార్త గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీంతో దలపతి ఫ్యాన్స్ తీవ్ర గందరగోళంలో పడిపోయారు. తమ అభిమాన నటుడు ఎంతో ప్రేమించే తన భార్య సంగీత నుంచి విడాకులు తీసుకోవడం ఏంటి? అంటూ టెన్షన్ పడ్డారు.

ఈ వార్తలకు బలం చేకూరేలా.. గత కొన్ని రోజుల నుంచి దలపతి విజయ్ తన సినిమా కార్యక్రమాలకు ఒంటరిగానే వస్తున్నాడు. నిజానికి విజయ్ ప్రతి ఈవెంట్ కు తన భార్య సంగీతను తీసుకుని వస్తాడు. కానీ, కోలీవుడ్ దర్శకుడు అట్లీ ఇంట్లో జరిగిన ఒక కార్యక్రమానికి, తాజాగా వారీసు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ ఒంటరిగానే వచ్చాడు. దీంతో “దలపతి, సంగీత విడాకులు తీసుకోవడం దాదాపు ఖాయమని, చాలా రోజుల నుంచే వీళ్లు విడివిడిగా ఉంటున్నారు” అంటూ పెద్ద ఎత్తున్న వార్తలు వచ్చాయి.

- Advertisement -

ఈ వార్తలపై తాజాగా దలపతి విజయ్ స్నేహితులు స్పందించారు. విజయ్, సంగీత అన్యోన్యమైన జంట అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఇటీవల విజయ్ తో సంగీత ఈవెంట్ లకు రాకపోవడానికి కారణం.. సంగీత చెన్నైలో లేకపోవడమే అని వివరించారు. సంగీత ప్రస్తుతం తన పిల్లలతో అమెరికాలో ఉందని వెల్లడించారు. దీనికే విజయ్, సంగీత విడిపోతున్నారు అంటూ రూమర్స్ ను క్రియేట్ చేయడం సరికాదని తెలిపారు.

విజయ్ సన్నిహితులు డైవర్స్ పై క్లారిటీ ఇవ్వడంతో చాలా రోజుల నుంచి వస్తున్న ఈ రూమర్స్ కు చెక్ పడింది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు