Sadha : బాయ్ ఫ్రెండ్ తో విడిపోయిందా ?

బ్యూటిఫుల్ హీరోయిన్ సదా.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు సుపరిచితమే. వెండితెరపై “జయం” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సదా పెర్ఫార్మెన్స్ తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడు గుర్తుంటుంది. ఇక “వెళ్ళవయ్యా.. వెళ్ళు” అంటూ ఈ సినిమాలో సదా చెప్పిన డైలాగ్ ఎంత పాపులర్ అయిందో కూడా తెలిసిన విషయమే. మొదటి చిత్రంతోనే తెలుగు ఆడియన్స్ ని తన మాటలతో, అందంతో, నటనతో కట్టిపడేసిన సదా ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటించి టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకుంది.

ఆ తరువాత కొన్ని సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సదా.. ప్రస్తుతం బుల్లితెరపై డాన్స్ ప్రోగ్రాం కు జడ్జిగా వ్యవహరిస్తూ తన సత్తా చాటుతోంది. అంతేకాక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత బంధాలపై సదా చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది.

“మనలో చాలామంది వారికి ఇష్టమైన వ్యక్తులను కోల్పోతారేమో అని భయపడుతుంటారు. మీ ఎదుగుదలకు అడ్డువచ్చే వ్యక్తులను సున్నితంగా తిరస్కరించడం మేలు. ఒకప్పుడు మీతో సన్నిహితంగా ఉన్నవారు కూడా ఒక్కొక్కసారి మీకు సహకరించరు. మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకున్న వారు మాత్రమే మీకు పూర్తిగా సహకారం అందిస్తారు. మన జీవితంలోకి రకరకాలైన మనుషులు వచ్చి పోతుంటారు. కానీ చివరకు మనతో ఉండేది మనం మాత్రమే. జీవితం చాలా చిన్నది. బలవంతంగా బంధాల్లో ఉండడం కంటే ఒంటరిగా సంతోషంగా ఉండడం మంచిది ” అని సదా చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

- Advertisement -

38 ఏళ్ల ఈ బ్యూటీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. అయితే ఈ బంధం, ఒంటరి జీవితం గురించి ఇంత లోతుగా సదా ఎందుకు పోస్టు పెట్టింది అనే ప్రశ్న అందరిలోనూ వెలుగుతుంది. దీనికి కొంత మంది సదా తన బాయ్ ఫ్రెండ్ తో విడిపోయిందని, అందుకే బలవంతంగా బంధాల్లో ఉండాలేమంటూ ఈ పోస్ట్ పెట్టింది అని కామెంట్ చేస్తున్నారు. మరి అది నిజమో కాదో తెలియాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు