Dhanush: అప్పుడు చెప్తే ఇప్పుడు మొదలైంది

తమిళ్ స్టార్ హీరో ధనుష్ కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది.
ధనుష్ నటించిన ఎన్నో డబ్బింగ్ సినిమాలకు తెలుగులో మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం ధనుష్ తెలుగులో డైరెక్ట్ సినిమాలు చేస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ “సార్” అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమా ఫిబ్రవరి 17 న రిలీజ్ కు సిద్దమవుతుంది.

ధనుష్ మరియు ఫీల్ గుడ్ మూవీస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో సినిమా రానున్నట్లు చాలా రోజులు క్రితం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ధనుష్-శేఖర్ కమ్ముల సినిమా ఈరోజు ప్రారంభం కానుంది. తెలుగులో ఈ రెండు ప్రాజెక్ట్స్ మాత్రమే కాకుండా “విరాట పర్వం” దర్శకుడు వేణు ఉడుగుల తో ధనుష్ కొత్త ప్రాజెక్ట్ కోసం జతకట్టవచ్చని కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ధనుష్-శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. SVCLLP బ్యానర్‌పై నారాయణ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు