Devi Sriprasad: ట్రాక్ లోకి వచ్చేసిన దేవి

దేవి సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చాడు దేవిశ్రీప్రసాద్. దేవిశ్రీప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చాలామందికి దేవి మ్యూజిక్ గురించి కొత్తగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే దేవి మ్యూజిక్ ఒక తరంలో ఒక యూత్ ని ఒక ఊపు ఊపింది అని చెప్పొచ్చు. ఎంతోమంది స్టార్ హీరోలతో వర్క్ చేశాడు దేవి. అయితే రీసెంట్ టైమ్స్ లో తమన్ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. దేవి కూడా కేవలం సుకుమార్ సినిమాలు తప్ప మిగతా సినిమాలేవి రీసెంట్ టైంలో చేయలేదు. కానీ బాబి దర్శకత్వంలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో మంచి పాటలు ఇచ్చి అద్భుతమైన హిట్టు అందుకున్నాడు.

దేవిశ్రీప్రసాద్ దేవి ప్రసాద్ చిరంజీవితో చేయటం మొదటిసారి ఏమీ కాదు. ఎంతోమంది స్టార్ హీరోలకి అద్భుతమైన మ్యూజిక్ను దేవిశ్రీప్రసాద్ అందించాడు. దేవిశ్రీప్రసాద్ అనగానే టక్కున గుర్తు వచ్చే సినిమాలు నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, పౌర్ణమి, వెం,కీ శంకర్ దాదా ఎంబిబిఎస్ ఇలాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు అద్భుతమైన మ్యూజిక్ అందించాడు దేవిశ్రీప్రసాద్. ఇంకా దేవి చేసిన బెస్ట్ ఆల్బమ్ అంటే జల్సా అని చెప్పొచ్చు జల్సా సినిమాలో ప్రతిపాటను అద్భుతంగా మలిచాడు దేవి శ్రీ ప్రసాద్.

పవన్ కళ్యాణ్ కి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ చేసి చాలా ఏళ్లయింది. ప్రస్తుతం ఇప్పుడు మళ్లీ దేవి ట్రాక్ లోకి వచ్చాడని చెప్పచ్చు. అద్భుతమైన లైనప్ ను తన కెరీర్ కి క్రియేట్ చేసుకున్నాడు దేవిశ్రీప్రసాద్. ప్రస్తుతం దేవి శ్రీ ప్రసాద్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్పా 2 సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఆ సినిమా తర్వాత చందు ముండేటి దర్శకత్వంలో నాగచైతన్య నటించిన దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -

ఈ సినిమాతోపాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ నటిస్తున్న సినిమా కూడా దేవి సంగీతం అందిస్తున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేయబోయే ఉస్తాద్ సినిమా కూడా దేవి సంగీతం అందించనున్నాడు. ఇదివరకే వీరి కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాకి అద్బుతమైన సంగీతాన్ని అందించాడు దేవి శ్రీ ప్రసాద్. ఏదేమైనా మళ్లీ దేవి ట్రాక్ లోకి వచ్చాడని చెప్పొచ్చు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు