Connect-Laththi : భారీ అంచనాలతో వచ్చి…

హీరో ఎవరైతే ఏంటి కంటెంట్ బాగుందా లేదా అనేది మాత్రమే చూస్తున్నారు మూవీ లవర్స్. భారీ బడ్జెట్ సినిమాలు వచ్చినా కూడా కంటెంటె బాగున్న చిన్న సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే ఆ రిజల్ట్స్ నీ చూస్తూనే ఉన్నాం. భారీ బడ్జెట్ తో వచ్చిన ఆచార్య సినిమాలో మంచి కంటెంట్ లేక డిసాస్టర్ ను చూసాము. తక్కువ బడ్జెట్ తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కార్తికేయ 2నr కూడా చూసాము.

ఇలా హీరో హీరోయిన్, భాష బేధం లేకుండా స్టోరీ లైన్ నచ్చితే చాలు థియేటర్స్ కి వెళ్తున్నారు. ఇదే కాకుండా కరోనా ఎఫెక్ట్ వల్ల OTTను ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో స్టోరీ లేని సినిమాలు తీస్తే ప్రేక్షకులు థియేటర్స్ కి కూడా వెళ్లడం మానేస్తారు. అదే పరిస్థితి నయనతార తో పటు విశాల్ కు వచ్చి పడింది.

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన హారర్ సినిమా ‘కనెక్ట్’ పాటు ఇవాళ హీరో విశాల్ నటించిన ‘లాఠీ’ సినిమాలు రిలీజ్ అయాయి.
బ్రేక్ లేకుండా సాగె మొదటి తమిళ సినిమాగా వచ్చిన అంటూ భారీ స్థాయి లో ప్రమోషన్స్ చేసారు చిత్ర యూనిట్. అప్పటి లాగే తన నటన తో నయనతార ఆకట్టుకుంటున్నా, స్టోరీ స్లోగా సాగడంతో నెగటివ్ టాక్ వినిపిస్తోంది. భారీ అంచనాలతో వచ్చిన కనెక్ట్ మాత్రం ప్రేక్షకులకి మాత్రం కనెక్ట్ కాలేక పోయింది.

- Advertisement -

ఇక ‘లాఠీ’ సినిమాకి వస్తే ఫస్ట్ హాఫ్ సూపర్ అనిపించుకునా, సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉండటంతో ప్రేక్షకులను మెప్పించ లేకపోయిందని టాక్ వినిపిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన లాఠీ, అది ఓవర్ యాక్షన్ గా ఉండటంతో నెగటివ్ టాక్ వస్తోంది. దీంతో ఎంత పెద్ద స్టార్స్ అయినా, మంచి కంటెంట్ తో రాకుంటే ప్రేక్షకులు రిజక్ట్ చేస్తారని ఈ రెండు సినిమాలతో మరోసారి రుజువు అయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు