Sushmitha konidhela: మెగాస్టార్ మాటా తప్పాడా ?

చిరంజీవి అంటే ఇష్టపడని వ్యక్తి ఎవరు ఉండరు. ఆయన సినిమాల, సేవ కార్యక్రమాలు, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలబడే మనస్తత్వం ఆయనని ప్రేక్షకులకి మరింత దగ్గర చేసాయి.

చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా తరువాత ఆయన ఎవరితో సినిమా చేయబోతున్నారు అనేది ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ అవుతుంది. చిరంజీవి ఈ డైరెక్టర్ తో వర్క్ చేయబోతున్నారు. చిరంజీవి ఆ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నారు అని రోజుకొక న్యూస్ సోషల్ మీడియా వైరల్ అవుతుంది. అయితే నిజానికి చిరంజీవి కథలు వింటున్నారు అనేది నిజమే కానీ ఎవరితో సినిమా చేస్తాడు అనేది ఇంకా తేలాల్సి ఉంది.

చిరంజీవి ఆ మధ్య తన కూతురు సుష్మితకి ఆమె ప్రొడక్షన్ లో ఒక సినిమా చేస్తాడని మాట ఇచ్చారు. సుష్మిత కూడా చిరు మాట ఇవ్వడంతో కొంత మంది డైరెక్టర్స్ తో ఆమె కథల గురించి చర్చలు జరిపింది. తమిళ్ డైరెక్టర్ పీ.యస్ మిత్రన్ చెప్పిన కథ కి ఆమె ఒకే చెప్పి చిరంజీవితో ప్లాన్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది అనే వార్తలు అప్పట్లో వచ్చాయి.

- Advertisement -

కానీ ఇప్పుడు వచ్చే రూమర్స్ చూస్తుంటే సుష్మిత సినిమా వెనక్కి వెళ్లినట్టు అనిపిస్తోంది. చిరు ఇప్పటికే బింబిసార డైరెక్టర్ వశిష్ఠ చెప్పిన కథ కి ఒకే చెప్పారని , అలాగే కళ్యాణ్ కృష్ణ చెప్పిన కథకి కూడా పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యారనే వార్తలు గత కొద్దీ రోజులు వైరల్ అవుతుండటంతో మరి సుష్మితతో సినిమా చేస్తారా లేదా అనేది తెలియటం లేదు.

పి.యస్ మిత్రన్ తమిళ్ లో మంచి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఆయన సినిమాలు తెలుగులో కూడా డబ్ అయి మంచి విజయాన్ని సాధించాయి. అయితే చిరు భోళా శంకర్ తరువాత ఈ సినిమానే చేస్తారు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చే రూమర్స్ దీనికి భిన్నంగా ఉన్నాయి. మరి చిరు కూతురికి మాట ఇచ్చినట్టు సుష్మిత తో సినిమా చేస్తారా లేక యంగ్ డైరెక్టర్ లకి అవకాశం ఇస్తారా.. అనేది చూడాలి.

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు