Nani: దసరా ఓటిటికి వచ్చేస్తుంది

నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన దసరా సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాని కెరీర్ లోనే దసరా హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టి బాక్స్ ఆఫీస్ ముందు బ్లాక్ బస్టర్ గా నిలిచింది. డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నానిని వంద కోట్ల హీరోని చేసింది.

తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఈ ఏడాది వచ్చిన 100 కోట్ల సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఇంకా థియేటర్స్ లో సందడి చేస్తున్న ఈ సినిమా తొందరలోనే ఓటిటిలోకి రాబోతుంది. అయితే సినిమా రిలీజ్ కి ముందే ఓటిటి బిజినెస్ జరుగుతుండటంతో ఈ మధ్య వచ్చే సినిమాలు రిలీజ్ అయిన కొద్దీ రోజుల్లోనే ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి.ఇది నిర్మాతలకి ఒక రకంగా లాభాన్ని మరో రకంగా నష్టాన్ని మిగుల్చుతున్నాయి.

రిలీజ్ కి ముందే ఓటిటికి ఇవ్వడం వల్ల నిర్మాతలకి సినిమా ఒకవేళ ప్లాప్ అయితే వచ్చే నష్టం నుంచి తప్పించుకోగలుగుతున్నారు. అదే సమయంలో ఒక వేళా సినిమా సూపర్ హిట్ అయితే కూడా ఆ సినిమాకి ఉన్న డిమాండ్ ని బట్టి ఓటిటి సంస్థలు రిలీజ్ అయినా కొద్దీ రోజుల్లోనే వాళ్ళ ఒప్పందం ప్రకారం ఓటిటి లో రిలీజ్ చేస్తున్నారు కారణంగా జనాలు థియేటర్ వరకు వెళ్లకుండానే ఆగిపోతున్నారు.

- Advertisement -

రీసెంట్ గా రిలీజ్ అయిన బలగం సినిమా కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యింది. థియేటర్స్ మంచి కలెక్షన్స్ తో సినిమా రన్ అవుతున్న కూడా ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ సినిమాని వాళ్ళ యాప్ లో రిలీజ్ చేయడంతో థియేటర్ వద్ద జనాలు తగ్గారు. ఇప్పుడు లేటెస్ట్ గా దసరా పరిస్థితి కూడా ఇలాగే అయ్యేలా ఉంది.

మార్చి 30న రిలీజ్ అయినా దసరా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యి , థియేటర్స్ లో మంచి రన్ లో ఉండగానే ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ దసరా సినిమాని ఈ నెల 27 నుంచి స్ట్రీమ్ చేయనున్నట్టు ప్రకటించింది.అయితే ఈ రకంగా సినిమా రిలీజ్ అయిన కొద్దీ రోజుల్లోనే ఓటిటిలకి రావడం వాళ్ళ థియేటర్స్ వరకు వెళ్లలేని పరిస్థితి ఉన్న వాళ్ళకి మంచి న్యూస్ కానీ ఇదే పరిస్థితి కంటిన్యూ ఐతే ప్రేక్షకులు థియేటర్ లో ఎం చూస్తాం నాలుగు రోజులు పోతే ఓటిటికి వస్తుంది అప్పుడు చూద్దాం లే అనుకుంటే ఇక థియేటర్స్ మూసుకునే పరిస్థితి వస్తుంది.

 

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు