Charmee: ఛార్మీ వివాహానికి కన్నతండ్రే అడ్డు.. నిజమెంత..?

Charmee: ప్రముఖ హీరోయిన్ ఛార్మీ కౌర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. హీరోయిన్ గానే కాకుండా డాన్సర్ గా, నిర్మాతగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఇంత వయసు వచ్చినా ఇంకా వివాహానికి దూరంగానే ఉంటుంది . ఇప్పటికే ఎంతమందితో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. కానీ అందులో నిజం లేకుండా పోయింది. వాస్తవానికి డైరెక్టర్ కృష్ణ వంశీ తో ఎఫైర్ నడుపుతోందనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్, రాఘవ లారెన్స్, పూరీ జగన్నాథ్ ఇలా చాలామందితో ఈమె ఎఫైర్ నడుపుతున్నట్లు వార్తలు వినిపించాయి .కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదు అయితే ఇప్పటికీ కూడా పూరీ జగన్నాథ్ తో రిలేషన్ లో ఉందనే వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.

అంతేకాదు ఈ వార్తలకు తగ్గట్టుగానే అటు ఛార్మీ ఇటు పూరీ జగన్నాథ్ ఇద్దరూ కూడా ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్తూ ఉంటారు. అంతేకాదు పూరీ జగన్నాథ్, ఛార్మీ కోసం తన భార్యకు విడాకులు ఇచ్చి ఈమెను వివాహం చేసుకుంటారని వార్తలు కూడా వినిపించాయి. అయితే ఇప్పటివరకు వీరి పెళ్లయితే జరగలేదు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఛార్మిను మీడియా మిత్రులు ఒక ప్రశ్న అడిగారు.. దానికి ఆమె సమాధానం చెబుతూ.. అసలు విషయాన్ని బయట పెట్టింది.. నా తండ్రి వల్లే నేను పెళ్ళికి దూరంగా ఉంటున్నాను..

ఎందుకంటే నా తండ్రి నువ్వు మ్యారేజ్ మెటీరియల్ వి కాదు అని.. ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకుంటే ఎప్పుడు భర్తకు దగ్గరలో.. భర్తకు సేవలు చేస్తూ.. అతడికే అనుకూలంగా నువ్వు ఉండాల్సి ఉంటుంది. కానీ నువ్వు అలా ఉండలేవు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడా నీకు విడాకులు తప్పవు.. అందుకే నువ్వు సింగిల్గానే ఉండు అని మా నాన్న చెప్పారు. నా గురించి పూర్తిగా అర్థం చేసుకున్నారు కాబట్టే ఈ విషయాన్ని తెలిపారు. అందుకే నాకు జీవితంలో పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం లేదు అంటూ షాక్ ఇచ్చింది ఛార్మీ .. మొత్తానికి అయితే ఛార్మీ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక దీన్ని బట్టి చూస్తే ఛార్మీ మిగతా హీరోయిన్ల లాగే ఒంటరి జీవితానికి పరిమితం కానున్నట్లు సమాచారం.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు