Chandini Chowdary: కోలీవుడ్ కి ఎంట్రీ

తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి వరుస అవకాశాలతో దూసుకెళ్తుంది. ఈ భామ సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం, నితిన్ తో లై సినిమాలో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. వీటి తర్వాత సుహాస్ తో కలిసి కలర్ ఫోటో అనే సినిమాలో నటించింది. ఈ సినిమాతో చాందని చౌదరి యాక్టింగ్ కెరీర్ మారిపోయింది. హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఈ సినిమాకు ఇటీవల జాతీయ అవార్డు కూడా వచ్చింది. చాందిని చౌదరి ఇటీవల కిరణ్ అబ్బవరంతో సమ్మతమే అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చాందిని చౌందరి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.

చాందని చౌదరి ప్రస్తుతం కోలీవుడ్ ఎంట్రీకి సిద్ధం అవుతుంది. కోలీవుడ్ హీరో అశోక్ సెల్వన్ కొత్త సినిమాలో ఈ తెలుగు భామకు అవకాశం వచ్చింది. ఈ విషయాన్నిచాందని చౌదరి తన ట్విట్టర్ లో తెలిపింది. ఈ సినిమాలో చాందిని తో పాటు మేఘా ఆకాష్ కూడా నటించబోతుంది. కాగ చాందిని చౌందరి కోలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వబోతుందని కొన్ని రోజుల నుండి వార్తలు వచ్చాయి. ఈ వార్తలను నిజం చేస్తూ చాందిని చౌదరి ట్వీట్ చేసింది. ఒక అద్భతమైన టీంతో కోలీవుడ్ కి తాను ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించింది. కోలీవుడ్ లో ఈ సినిమా హిట్ అయితే, చాందిని టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ బిజీ అయిపోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు