Dasara: టార్గెట్ 51 కోట్లు.. నాని కొట్టగలడా?

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన కొత్త చిత్రం దసరా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 30 న విడుదలవుతుంది. పాన్ ఇండియా చిత్రం గా తెరకెక్కిన ఈ సినిమా 5 భాషల్లో అనగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల అవుతుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. సాయికుమార్, సముద్రఖని, పూర్ణ, జరీనా వాహబ్, దీక్షిత్ శెట్టి తదితరులు ముఖ్య పత్రాలు పోషించారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని పాటలన్ని ఇప్పటికే సూపర్ హిట్లయ్యాయి.

అయితే ఈ సినిమా కు వరల్డ్ వైడ్ గా 50 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయింది. ఏరియా ల వారీగా లెక్కలను గమనిస్తే నైజాం13.7Cr, సీడెడ్ 6.5Cr, ఉత్తరాంధ్ర 3.9Cr, ఈస్ట్ 2.35Cr, వెస్ట్ 2Cr, గుంటూర్ 3Cr, కృష్ణా 2Cr, నెల్లూరు 1.2Cr టోటల్ గా ఆంధ్ర, తెలంగాణ మొత్తం 34 కోట్లు. ఇదీ గాక ఓవర్సీస్ 6 కోట్లు, కర్ణాటక 2.85Cr, తమిళం, మలయాళ భాషల్లో కలిపి1.5Cr, హిందీ వెర్షన్ 5 కోట్లు, మొత్తం కలిపి 50 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా 51 కోట్ల టార్గెట్ ను అందుకోవాలి.

అయితే నాని కెరియర్ లోనే బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే భారీ ఓపెనింగ్స్ ను అందుకోవాల్సి ఉంటుంది. కానీ నాని నటించిన సినిమాల్లో ఈగ మినహా ఏ సినిమా కూడా 40 కోట్లకు పైగా వసూలు చేయలేదు. అయితే ఈ సినిమాకు ఇప్పటి వరకు అయినా అడ్వాన్స్ బుకింగ్స్ వల్ల మొదటి రోజే దాదాపు 30 కోట్ల ఓపెనింగ్స్ రావొచ్చని అంచనా వేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు