మలయాళం సూపర్ హిట్ అయిన ‘కప్పెల’ సినిమా తెలుగులో బుట్ట బొమ్మగా విడుదలకాబోతుంది. అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ట, అర్జున్ దాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ ప్రొమోషన్స్ లో భాగంగా మేకర్స్ ఈరోజు థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసారు.ఇది అనిఖా సురేంద్రన్ పాత్ర పరిచయంతో మొదలవుతుంది. ఒక అజ్ఞాత వ్యక్తి అనికా సురేంద్రన్‌కి ఫోన్ చేసి ఆమె పేరు అడగడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఆటో డ్రైవర్‌గా ఉండే ఈ వ్యక్తితో మాట్లాడేందుకు ఆమె మొదట ఆలోచిస్తుంది. కానీ వారి మధ్య ఒక అందమైన బంధం ఏర్పడుతుంది. వారి జీవితంలోకి అర్జున్ దాస్ ప్రవేశిస్తాడు, ఆ తరువాత ఎటువంటి పరిణామాలు ఎదురయ్యాయి అనేది సినిమా కథాంశం.
Read More: Kangana: నాపై కూడా యాసిడ్ దాడి చేస్తారని భయపడ్డా
జీవితంలో స్వేచ్ఛను కోరుకునే పల్లెటూరి అమ్మాయిగా అనికా సురేంద్రన్ అద్భుతంగా నటించింది. ఆమె ముద్దుగా, అందంగా కనిపించింది. సూర్య మరియు అర్జున్ దాస్ తమ తమ పాత్రలతో ఆకట్టుకున్నారు. శౌరి చంద్రశేఖర్ టి రమేష్ డిఫరెంట్ స్టోరీతో వచ్చి ఆకట్టుకునేలా చేశాడు. సంగీత దర్శకుడు గోపీసుందర్, సినిమాటోగ్రాఫర్ వంశీ పచ్చిపులుసు విజువల్స్ అందంగా ఉన్నాయి.
బుట్ట బొమ్మ కొన్ని మలుపులతో గ్రిప్పింగ్ గా యూత్‌తో పాటు ఫ్యామిలీస్‌ని కూడా ఈ సినిమా ఆకట్టుకునేలా ఉండబోతుంది అని అర్ధమవుతుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 4న థియేటర్లలో విడుదల కానుంది.
Read More: Happy birth day Raj Tharun : యూట్యూబ్ నుంచి వెండితెర వరకు
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News
‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్...
మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి...
ఒక సినిమాకు డైరెక్టర్… కెప్టెన్ అఫ్ ది...
అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ డైరెక్టర్...
నితిన్ హీరోగా నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ...