Pawan kalyan: బ్రో కి లవ్ స్టోరీ కూడా ఉందన్నమాట

ఇటీవలనే బ్రో సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న థమన్, ఈ సినిమా గురించి మాట్లాడుతూ, బ్రో సినిమా ఒక ఎమోషల్ సినిమా అని చెప్పిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ ఈ స్టోరీ నరేషన్ ఇచ్చినప్పుడే అందరి కళ్ళలో నీళ్లు తిరిగాయని కూడా ఆయన చెప్పారు. దాంతో బ్రో సినిమా ఒక ఎమోషనల్ సినిమా ప్రేక్షకులందరిలో క్లారిటీ వచ్చింది. కానీ రీసెంట్ రిలీజైన బ్రో సినిమా పోస్టర్ చూస్తే బ్రో సినిమాలో సెంటిమెంట్ తో పాటు యూత్ ఫుల్ లవ్ స్టోరీ కూడా ఉండబోతుందని తెలుస్తోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్నఈ సినిమా జులై 28న గ్రాండ్ గా రిలీజ్ అవబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగా ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్ లో పవన్ కళ్యాణ్ స్వాగ్, డైలాగ్ డెలివరీ బాడీ లాంగ్వేజ్ అంత ఒకప్పటి పవన్ కళ్యాణ్ సినిమాలను గుర్తు తెచ్చే విధంగా ఉండటంతో బ్రో సినిమా కోసం అంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

అయితే ఇటీవలనే ఈ సినిమాకు సంబంధించి మై డియర్ మార్కండేయ పాటకు ప్రేక్షకుల దగ్గర నుంచి ఆశించినంత రెస్పాన్స్ రాకపోవడంతో అంచనాలు కాస్త తగ్గాయి. దీనిపై మ్యూజిక్ డైరెక్టర్ థమన్ క్లారిటి ఇస్తూ సినిమా ఒక ఎమోషనల్ సినిమా అని కథకు అనుగుణంగానే ట్యూన్స్ అందించనని చెప్పడంతో ఫ్యాన్స్ కి కాస్త ఊరట లభించింది.

- Advertisement -

ఇక బ్రో సినిమాలోని సెకండ్ సాంగ్ ఈ నెల 15 న రిలీజ్ చేయబోతున్నట్టు మూవీ టీం పోస్టర్ రిలీజ్ చేసింది. ఇక పోస్టర్ లో సాయి ధరమ్ తేజ్ మరియు హీరోయిన్ కేతిక శర్మ ఒక రొమాంటిక్ స్టీల్ తో దర్శనమివ్వగా ఫ్యాన్స్ లో కాస్త ఉత్సహం వచ్చిందనే చెప్పాలి. థమన్ మాటలకూ థియేటర్ లో ఎమోషన్ అవ్వక తప్పదనుకున్న ఫ్యాన్స్ కు ఈ స్టీల్ తో బ్రో సినిమాలో యూత్ ఫుల్ ఎలిమెంట్స్ కూడా సినిమా మెండుగా ఉన్నాయని అర్థమైంది. దాంతో పీకే ఫ్యాన్స్ లో బ్రో సినిమా పై వెయిటింగ్ ఇంకాస్త పెరిగింది. త్రివిక్రమ్ రచన సహకారం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గ్రాండ్ గా రిలీజ్ చేయబోతుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు