Bheed: కొంపముంచిన కొత్త ప్రయోగం..

సినిమా రంగం నుంచి ఎప్పటికప్పుడు ప్రేక్షకులు కొత్తదనాన్నికోరుకుంటున్నారు. ఈ క్రమంలో పాన్ ఇండియా, ఓటీటీ, ఓవర్ మస్, యాక్షన్ అంటూ కొత్త తరహా సినిమాలు వస్తున్నాయి. ఇక ముందు కూడా సినిమాల్లో ఇలాంటి మార్పులు రావొచ్చు. వానిని అందరూ పాటించవచ్చు. అయితే అనుభవ్ సిన్హ అనే డైరెక్టర్ ఓ ప్రయోగం చేశాడు. కొత్త ప్రయోగమా.. అంటే అదీ కాదు. చాలా ఏళ్ల క్రితం ప్రేక్షకులు చూసి చూసి మొహం కొట్టేసిన బ్లాక్ అండ్ వైట్ ప్రయోగం.

ప్రస్తుతం కలర్.. HD, 4K అంటు పరుగులు పెడుతున్న కాలంలో బ్లాక్ అండ్ వైట్ లో సినిమాలు ఎవరు చేస్తారు. అలా చూడలేకే, మయా బజర్ వంటి సినిమాలను కలర్ లో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆ మాత్రం తెలయకుండా, ఈ అనుభవ్ సిన్హ తన కొత్త సినిమా భీడ్ ను సహజత్వం పేరుతో బ్లాక్ అండ్ వైట్ లో తెరకెక్కించాడు. ఈ సినిమాను శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేశారు.

కానీ, ప్రయోగాత్మక ఈ సినిమా ఎవరికీ కూడా రుచించలేదు. కనీసం థియేటర్ వద్దకు కూడా ఎవరూ రాలేదు. కొన్ని థియేటర్ లలో ఇద్దరు.. ముగ్గురు వస్తే.. వారిని కూడా పంపించేసి షోలను క్యాన్సిల్ చేశారట. దీంతో మొదటి రోజు ఈ బ్లాక్ అండ్ వైట్ మూవీ కలెక్షన్లు నిర్మాతల కండ్లు బైర్లు కమ్మేలా వచ్చాయి. కేవలం 15 లక్షల వసూళ్లును మాత్రమే రాబట్టింది ఈ మూవీ. ఇది పెట్టిన బడ్జెట్.. బ్రేక్ ఈవెన్ పాయింట్ గురించి పక్కనపెడితే, కనీసం ప్రమోషన్ ఖర్చులను కూడా తీసుకురావడం కూడా కష్టమే.

- Advertisement -

భీడ్ ను కరోనా సమయంలో వచ్చిన ఫస్ట్ లాక్ డౌన్ నేపథ్యంలో తెరకెక్కించారు. మంచి సినిమాలను తెరకెక్కించడంలో అనుభవ్ సిన్షకు గట్టి అనుభవమే ఉంది. స్టోరీని, స్క్రీన్ ప్లేను అదే విధంగా డిజైన్ చేసి ఉంటాడు. కానీ, బ్లాక్ అండ్ వైట్ అంటే ప్రేక్షకులు కనీసం థియేటర్ గడప కూడా తొక్కలేదు. ఇది అనుభవ్ సిన్హకే కాదు.. బాలీవుడ్ కు మాయని మచ్చలా మారింది.

పఠాన్, తూ ఝూటి మై మక్కర్ సినిమాలతో బాలీవుడ్ ఇండస్ట్రీ కొంత మేరకు సెట్ అయింది అని అనుకుంటున్న సమయంలో భీడ్ వచ్చి.. బాలీవుడ్ ను మరోసారి పాతాళంలోకి తీసుకెళ్లింది. ఈ దెబ్బతో బాలీవుడ్ కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు