Bhola Shanker: అక్కడ ఆరు వందల లొకేషన్లలో మెగా రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం భోళా శంకర్ . వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత చిరంజీవి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ చాలా రోజుల తర్వాత ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఏకే ఎంటెర్టైన్మెంట్స్ పతాకంపై రామ బ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తుండగా, మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా చిరంజీవి చెల్లెలు గా కీర్తి సురేష్ నటిస్తుంది.

తమిళ్ హిట్ వేదాళం సినిమాకి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నా, తెలుగులో చాలా మార్పులు చేసి తీసుకొస్తున్నారు. ఇప్పటికే విడుదలైన స్టిల్స్ తో మెగాస్టార్ లుక్స్ తో మెప్పించగా ఇక పాటల ద్వారా అలరించనున్నారు. జూన్ 4న ఈ సినిమానుండి తొలి పాత విడుదల అవుతుండగా త్వరలోనే మిగతా పాటలు రిలీజ్ చేస్తారు. ఇక తాజాగా ఈ సినిమా నుండి మరో అప్ డేట్ వచ్చింది.

భోళా శంకర్ సినిమాని ఓవర్సీస్ లో భారీ ఎత్తున 600 లొకేషన్లలో విడుదల చేస్తున్నామని మేకర్స్ తెలియచేసారు. ఇక చిరుకి ఇప్పటికే ఓవర్సీస్ లో 2 మిలియన్ డాలర్ల సినిమాలు మూడు ఉన్నాయి. ఈ సినిమా ద్వారా మరో ఓవర్సీస్ రికార్డును తన ఖాతాలో వేసుకుందామని వేస్తున్నాడు చిరు. ఇక ఇప్పటికే 90 శాతం ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిపోగా మిగతా భాగం కూడా త్వరలోనే షూట్ చేసి ప్రమోషన్లపై పూర్తిగా ఫోకస్ పెట్టాలని చూస్తున్నారు చిత్ర యూనిట్. ఇక ఆగష్టు 11 న భోళా శంకర్ వరల్డ్ వైడ్ గా విడుదల అవుతుందన్న విషయం తెలిసిందే.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు