Bellamkonda : ప‌వ‌ర్ స్టార్ ద‌ర్శ‌కుడితో..

బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అల్లుడు శ్రీను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించారు. అయితే ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చినా కూడా బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. అప్పటినుండి ఇప్పటివరకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సక్సెస్ ల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అతడు ప్రయత్నాలు చూస్తుంటే ముచ్చటేస్తుంది. కానీ పాపం అతడికి సక్సెస్ మాత్రం దక్కడం లేదు అంటూ అభిమానించేవారు అంటూ ఉన్నారు.

ఇది ఇలా ఉండగా, భీమ్లా నాయక్ తో దర్శకుడిగా తనని తాను నిరూపించుకున్నాడు, సాగర్ చంద్ర. ఓ సూపర్ హిట్ సినిమా రీమేక్ ని తెరకెక్కించడం ఒక ఎత్తైతే, పవన్ కళ్యాణ్ అభిమానుల అంచనాలను అందుకోవడం మరో ఎత్తు. ఈ విషయంలో సాగర్ చంద్రకు పూర్తి మార్కులు పడ్డాయి. త్రివిక్రమ్ నీడలో కూడా, తన ఉనికిని చాటుకున్నాడు సాగర్.

అయితే, తాజా సమాచారం ప్రకారం, సాగర్ చంద్ర ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఓ సినిమా చేయబోతున్నాడట. ఇప్పటికే బెల్లంకొండకు కథ చెప్పేసాడని, బెల్లంకొండ కూడా ఓకే చేశాడని వార్తలు వస్తున్నాయి. బెల్లంకొండ ప్రస్తుతం ‘ఛత్రపతి’ రీమేక్ తో లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. తెలుగులో కొత్తగా రెండు సినిమాలు చేయడానికి అంగీకరించాడని టాక్. అందులో సాగర్ చంద్ర సినిమా కూడా ఉందట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు