Allu family: అల్లు స్నేహ పై భారీగా ట్రోల్ చేస్తున్న యాంటీ ఫ్యాన్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. “పుష్ప ది రైజ్” సినిమాతో దేశవ్యాప్తంగా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇటు సినిమాలతో పాటు అటు సోషల్ మీడియాలోనూ ఆయనకు విపరీతమైన క్రేజ్ ఉంది.

అలాగే ఆయన సతీమణి స్నేహ రెడ్డి కూడా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. అల్లు అర్జున్ స్నేహ రెడ్డిని 2011లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి అల్లు అయాన్, ఆర్హ ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. స్నేహ రెడ్డికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటారామే. తన గ్లామర్ తో హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా ఉంటాయి స్నేహ రెడ్డి ఫోటోలు. అలాగే తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటారు స్నేహారెడ్డి.

అయితే తాజాగా ఆమె చేసిన పని వల్ల అల్లు అర్జున్ అభిమానులు ఆమెపై ఫైర్ అవుతున్నారు. తాజాగా అల్లు అర్జున్ బర్త్ డే పార్టీకి సంబంధించిన ఫోటోలను స్నేహ రెడ్డి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలలో స్నేహారెడ్డి చాలా హాట్ గా దర్శనం ఇచ్చింది. మొదట్లో చీరల్లో ఫోటోషూట్ చేసిన స్నేహ రెడ్డి.. ఇప్పుడు గ్లామర్ డోస్ బాగా పెంచేసింది. స్కర్ట్స్, మిడ్డీలలో ఫోటోషూట్స్ చేస్తూ సందడి చేస్తుంది. అయితే రోజురోజుకీ స్నేహారెడ్డి గ్లామర్ డోస్ బాగా పెంచడంతో అల్లు అభిమానులు ఆమెపై మండిపడుతున్నారు. “ఇలాంటి పొట్టి బట్టలు ధరించకండి, ఒకవేళ వేసుకున్నా.. పబ్లిక్ ఫ్లాట్ ఫార్మ్ లో షేర్ చేయవద్దు” అంటూ ఆమెని రిక్వెస్ట్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు