టాలీవుడ్ నటుడు అల్లు శిరీష్ ఇటీవలే ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా తమిళ సినిమా ‘ప్యార్ ప్రేమ కాదల్’ ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రంలో అల్లు శిరిష్ సరసన అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించింది. ఈ చిత్రానికి రాకేష్ శశి దర్శకత్వం వహించారు. తిరుమల ప్రొడక్షన్‌తో కలిసి గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించింది. అల్లు అరవింద్ సమర్పకుడు గా వ్యవహరించారు. ఇప్పటి వరకు భారీ సక్సెస్ లేని అల్లు శిరీష్‌కి ఈ చిత్రం మంచి సక్సెస్ సాధించిందని పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
సక్సెస్ మీట్ లో అయితే అల్లు అర్జున్ ఆకాశానికే ఎత్తేశాడు. భారీ కలెక్షన్లు వస్తాయని ఊహించారు. కానీ ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు మాత్రం రాకపోవడం విశేషం. కేవలం యూత్ మాత్రమే రిలీజ్ అయిన రెండు, మూడు రోజులు వీక్షించారు. ఇక ఆ తరువాత ఈ సినిమాకి కలెక్షన్లు తగ్గిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా వీకెండ్‌లో 3.75 కోట్ల గ్రాస్‌ని మాత్రమే వసూలు చేసింది.
Read More: Box office: “మ్యాడ్” రచ్చ రెండు రోజులకే టార్గెట్ అవుట్!
ఊహించిన దాని కంటే ఎక్కువ హైప్, పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆడియెన్స్ మాత్రం ఈ సినిమాను వీక్షించకపోవడం విశేషం. ఇక అల్లు శిరీష్ గత సినిమాల కలెక్షన్ల విషయానికి వస్తే శ్రీరస్తు శుభమస్తు ఫస్ట్ వీక్ లో రూ.9.9 కోట్లు, ఒక్క క్షణం రూ.7 కోట్లు, ఏబీసీడీ రూ.6కోట్ల గ్రాస్ వసూలు చేశాయి. తాజాగా విడుదలైన ఊర్వశివో రాక్షసివో సినిమా ఇప్పటి వరకు దాదాపు రూ.4 కోట్ల వరకు మాత్రమే వసూలు చేయగలిగింది. ఆడియెన్స్ పెద్దగా థియేటర్లకు రాకపోవడం, అల్లు శిరీష్ నాలుగు సంవత్సరాల నుంచి ఒక్క సినిమా కూడా చేయకపోవడం వంటి కారణాలు అయి ఉండవచ్చు. దీంతో అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివో హిట్ కావాలంటే ఇంకా దాదాపు రూ.5 కోట్ల వరకు వసూలు చేయాలి. లేదంటే మరో ఫెయిల్యూర్ మూవీగానే నిలిచిపోవడం ఖాయం. థియేట్రికల్ రన్నింగ్ టైమ్ మొత్తం వరకు ఈ సినిమా వసూలు చేస్తుందో లేదో వేచి చూడాలి మరి.
Read More: Liger : కోలుకోవడం కష్టమేనా..?
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్...
టాలీవుడ్ లో లాస్ట్ వీక్ రిలీజ్ అయిన సినిమాల్లో...
ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో కోట బొమ్మాళి...
టాలీవుడ్ లో క్రేజీ అంచనాలతో రెండు వారాల...
టాలీవుడ్ లో ఈ వారం రెండు తెలుగు సినిమాలు...