Amigos: స్ట్రీమింగ్ పార్ట్నర్ ఫిక్స్

బింబిసార సినిమాతో సక్సెస్ ట్రాక్ పట్టుకున్న కళ్యాణ్ రామ్ తాజాగా అమిగోస్ అనే కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ చిత్రం గ్రాండ్ గా థియేటర్స్ లో ఈ రోజు రిలీజ్ అయింది. డోపెల్‌గ్యాంజర్స్ అనే కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం భారీ అంచనాలతో వచ్చింది. అయితే తొలి షో నుంచే సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. మరి ఈ సినిమాకు విజయం దక్కుతుందో.. లేదో తెలియాంటే చూడాలి.

కాగా “ఎన్నో రాత్రులొచ్చాయి గాని..” పాట సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది అని చెప్పవొచ్చు. ఈ పాట బాలకృష్ణ “ధర్మక్షేత్రం” మూవీ నుంచి రీమేక్ చేసారు. రీమేక్ సాంగ్ అయినప్పటికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటుంది. ఇదిలా ఉండగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అమిగోస్ చిత్రం గురించి సినీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం అమిగోస్ త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవనున్నట్టు తెలుస్తుంది. అయితే ఓటీటీ రిలీజ్ డేట్ ను మేకర్స్ త్వరలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కాగా టాలీవుడ్ నిర్మాతలు ఇటీవల ఓటీటీ రిలీజ్ పై కొన్ని నిబంధనలు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నిబంధనల ప్రకారం.. మిడ్ రేంజ్ సినిమాలు విడుదల తేదీ నుంచి నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి రావాలి.

- Advertisement -

కానీ, ప్రస్తుతం ఈ నిబంధనలను నిర్మాతలే పాటించడం లేదు. ఇటీవల సుధీర్ బాబు నటించిన హంట్ మూవీ రెండు వారాలకే ఓటీటీలో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం ఎప్పుడు ఓటీటీలోకి వస్తోందో చూడాలి మరి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు