Allu Arjun : రష్యాలో పుష్ప రాజ్ ల్యాండింగ్

అల్లు అర్జున్ అంటేనే స్టైల్ కి మారుపేరు. తన కొత్త లుక్స్ తో ఎప్పటికప్పుడు ట్రెండ్ సెట్ చేస్తూనే ఉంటాడు. స్టైలిష్ స్టార్ అనే పేరు వినగానే మనకు అల్లు అర్జున్ కటౌట్ కనిపిస్తుంది, గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన బన్నీ కెరియర్ తార జువ్వలా
దూసుకెళ్లింది,ఇప్పటివరకు బన్నీ కెరియర్ లో దాదాపుగా ఒకటి రెండు తప్ప మిగతా అన్ని హిట్ సినిమాలే.డాన్స్ లో గ్రేస్ ,డైలాగ్ డెలివరీ లో పర్ఫెక్షన్,కామిక్ టైమింగ్, డెడికేషన్ లాంటి గొప్ప లక్షణాలన్నీ బన్నీ ను ఒక స్టార్ హీరోను చేసాయి. ఆ స్టార్ హీరో ఇప్పుడు పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అయ్యాడు.

‘ఆర్య’ సినిమాతో ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయం అయిన సుకుమార్ మొదటి చిత్రం తోనే మంచి హిట్ సాధించి ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. తన సినిమాల్లో ఒకరకమైన వింత కేరక్టరైజేషన్స్ తో ఎప్పుడు ఆశ్చర్య పరుస్తూ నే ఉంటాడు ఈ స్టార్ డైరెక్టర్. అల్లు అర్జున్, సుకుమార్ కంబినేషన్ లో వచ్చిన రెండో మూవీ ఆర్య 2. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది.

రీసెంట్ గా ‘పుష్ప ది రైజ్’ సినిమాతో వీరిద్దరి కాంబినేషన్ పాన్ ఇండియా స్థాయి కి చేరుకుంది. ‘పుష్ప’ సినిమా సాధించిన ఘనతల గురించి అందరకి తెలిసిందే. సింపుల్ లాజిక్ తో పెద్ద సక్సెస్ అందుకున్నాడు ఐకాన్ స్టార్. ప్రస్తుతం పుష్ప చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ ని సెయింట్ పీటర్స్బర్గ్, మాస్కో లో రష్యన్ భాషలో ప్రదర్శించారు. ఈ రోజు రష్యా వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.
వీటి ప్రమోషన్స్ కోసం అల్లు అర్జున్, రష్మిక మందన సుకుమార్ రష్యా వెళ్లిన సంగతి తెలిసిందే.రష్యా లో పుష్ప ఏ స్థాయిలో విజయం సాధిస్తుందో వేచి చూడాలి మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు