Biopic: వెండితెరపై అక్కినేని నాగేశ్వరరావు బయోపిక్.. హీరో ఎవరంటే..?

వెండితెరపై ఇప్పటికే ఎంతోమంది గొప్ప నటుల జీవిత కథలు బయోపిక్ రూపంలో ఆవిష్కరించబడ్డ విషయం తెలిసిందే. కేవలం సినిమా సెలబ్రిటీల గురించి మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు, క్రీడా రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తుల గురించి ఇప్పటికే ఎన్నో బయోపిక్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు అక్కినేని నాగేశ్వరరావు.. త్వరలోనే ఈయన జీవిత చరిత్ర గురించి బయోపిక్ సినిమా రాబోతున్నట్లు గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఎవరు స్పందించలేదు. కానీ మళ్ళీ ఇప్పుడు ఈ వార్తలు రావడంతో తాజాగా ఈ విషయంపై అక్కినేని నాగేశ్వరరావు కుమార్తె నాగ సుశీల మహామాక్స్ అనే ఇంటర్వ్యూలో పాల్గొని వెల్లడించారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆమె తమ ఫ్యామిలీ గురించి ఎన్నో విషయాలను వెల్లడించడం గమనార్హం. నాగ సుశీల మాట్లాడుతూ.. నాన్న మాట తీరు చాలా కఠినంగా ఉంటుందని.. ఆయన కోపంగా ఉంటారని.. అమ్మ ఎప్పుడు చెబుతూ ఉండేది. కానీ ఏ రోజు కూడా మాతో అలా ప్రవర్తించలేదు. ఎప్పుడు ప్రేమగా అందరినీ దగ్గరకు తీసుకునేవారు. ఇక వేసవికాలంలో సెలవులు వస్తే మాత్రం తన మనవళ్లు మనవరాలు అందరూ కూడా తన దగ్గరే ఉండాలని కోరుకుంటారు. అందరిని తనతో పాటు షూటింగ్ లోకేషన్ కి కూడా తీసుకెళ్లే వారు. ఎక్కువగా ఊటీ వెళ్లే వాళ్ళం అంటూ నాగ సుశీల వెల్లడించారు. ఇక నాగేశ్వరరావు సినిమాల గురించి కూడా మాట్లాడుతూ.. తాను తన నాన్న సినిమాలు ఎక్కువగా చూడనని వెల్లడించింది.

ఇకపోతే అక్కినేని నాగేశ్వరరావు బయోపిక్ సినిమా కనుక తీస్తే ఏ హీరో అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అంటూ ఈమెకి ఒక ప్రశ్న ఎదురయింది. ఇక ఈ ప్రశ్నకు నాన్న బయోపిక్ సినిమా చేయాలి అంటే అది కేవలం నాగార్జున మాత్రమే నటించాలి. ఆయన అయితేనే చాలా అద్భుతంగా నటిస్తారు అంటూ నాగ సుశీల వెల్లడించింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరొక వేళ అక్కినేని నాగేశ్వరరావు బయోపిక్ తెరకెక్కితే ఆయన పాత్ర ఆయన వారసుడు నాగార్జున పోషిస్తారేమో చూడాలి.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు