Akhil: పవన్ టైటిల్ తో అక్కినేని హీరో ?

ఈ మధ్య కాలంలో యంగ్ హీరోలు పవన్ కళ్యాణ్ హిట్ సినిమాల టైటిల్స్ పై ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది. ఇప్పటికే వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ టైటిల్ ను వాడుకొని ఓ సూపర్ హిట్ కొట్టాడు. వరుణ్ మెగా హీరోనే కాబట్టి, పవన్ ఫ్యాన్స్ పెద్దగా ఇబ్బందిగా ఫీలవ్వలేదు. అయితే విజయ్ దేవరకొండ కూడా పవన్ టైటిల్ ను వాడుకున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ టైటిల్ తో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ టైటిల్ అనౌన్స్ చేయగానే విజయ్ పై ట్రోల్స్ వచ్చాయి. తాజాగా మరో యంగ్ హీరో అఖిల్ కూడా పవన్ టైటిల్ పై కన్నేసినట్టు తెలుస్తుంది.

గత ఏడాది అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ విజయాన్ని దక్కించుకున్నాడు. దీని తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా విడుదల కాక ముందే, తర్వాత చేయబోయే సినిమాల పై కూడా ఫోకస్ పెట్టాడట. ఇందులో భాగంగా ‘వకీల్ సాబ్’ దర్శకుడు వేణు శ్రీరామ్ తో ఓ సినిమా చేయడానికి అఖిల్ రెడీ అయినట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించబోతున్నారు అని టాక్. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కానీ, దీనికి ‘తమ్ముడు’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేసినట్లు టాక్ మొదలైంది. పవన్ కళ్యాణ్ కెరీర్లో క్లాసిక్స్ గా నిలిచిన సినిమాల్లో ‘తమ్ముడు’ కూడా ఒకటి. ఆ టైటిల్ తో సినిమా అంటే అఖిల్ పై పవన్ ఫ్యాన్స్ విమర్శలు గుప్పించే అవకాశం కూడా లేకపోలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు