Ram Pothineni : అలా చేస్తే చూడరు

రామ్ హీరోగా నటించిన ‘ది వారియర్’ చిత్రం జూలై 14న విడుదల కాబోతుంది. టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. దీని తర్వాత బోయపాటి దర్శకత్వంలో రామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కబోతుంది. రామ్ తెలుగులో నటించిన సినిమాలు యూట్యూబ్ లో హిందీ డబ్ అయ్యాయి. ఈ సినిమాకు మిలియన్ల కొద్దీ వ్యూస్ నమోదయ్యాయి. రామ్ ప్లాప్ సినిమాలకు కూడా అక్కడ మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ విషయం పై రామ్ కి ఓ ప్రశ్న ఎదురైంది.

‘మీ సినిమాలకు హిందీలో మంచి క్రేజ్ ఉంది. హిందీ ప్రేక్షకుల కోసం మీరు స్పెషల్ కేర్ ఏమైనా తీసుకోవాలని భావిస్తున్నారా’ అనేది ఆ ప్రశ్న. దీనికి రామ్ స్పందిస్తూ, ‘హిందీ మార్కెట్ కోసం మనం కొత్తగా ఏమీ చేయనవసరం లేదు. వాళ్ళు హిందీ సినిమాలు చూస్తారు. సౌత్ సినిమాలను కూడా చూస్తున్నారు అంటే అది మన ఫ్లేవర్ ఎంజాయ్ చేయడం కోసమే. మనం క‌న్‌ఫ్యూజ్‌ అయిపోయి, బాలీవుడ్ వాళ్ళు ఏం చేస్తున్నారో అది చేస్తామంటే హిందీ ప్రేక్షకులు చూడరు. హిందీ మార్కెట్ కోసం మనం ట్రై చేయలేదు. మన సినిమాలు హిందీలో డబ్ అయినప్పుడు వాళ్ళు చూశారు. చూస్తున్నారు. కాబట్టి మనం కొత్తగా ఏమీ చేయాల్సిన పని లేదు. అని రామ్ అన్నాడు.

నిజమే, ‘బాహుబలి’ ‘కె.జి.ఎఫ్’ ‘పుష్ప’ లాంటి సినిమాలు హిందీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని చేసిన సినిమాలు కాదు. కానీ, వాటిని హిందీ ప్రేక్షకులు ఆదరించారు. ఈ విషయం అర్ధం కాక చాలా మంది హీరోలు, దర్శకులు, హిందీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేయాలని తర్జనభర్జనలు పడుతున్నారు. ఈ విషయంలో రామ్ కు మంచి క్లారిటీ ఉందనే చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు