Adivi Sesh : ప్రభాస్,అనుష్క పెళ్లి తర్వాతే..

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోలు చాలా మందే ఉన్నారు. పెళ్లి వయస్సు వచ్చి, దాటిపోతున్నా పెళ్లీలకు దూరంగానే ఉంటున్నారు. పలువురు హీరోయిన్లు కూడా పెళ్లీల టాపిక్ తీయడానికి వెనకడుగు వేస్తున్నారు. వీరిలో ముందు వరుసలో ఉండేది ప్రభాస్. 42 ఏళ్ల వయస్సు వచ్చినా, ప్రభాస్ ఓ ఇంటి వాడు కాకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గానే ఉన్నాడు.

అలాగే నాలుగు పదుల వయస్సు ఉన్న అనుష్క శెట్టి కూడా పెళ్లి టాపిక్ తీయడం లేదు. టాలీవుడ్ లో పెళ్లి గురించి మాట్లాడితే, వీరే గుర్తుకు వస్తారు. ’’ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి’’ అంటూ ఓ సినిమా కూడా చేసేశారు. వీళ్లే కాకుండా ఇండస్ట్రీలో పెళ్లి కానీ ప్రసాదులు పదుల సంఖ్యలో ఉన్నారు. కెరీర్ లో మంచి సక్సస్ అందుకుంటున్నా, పెళ్లి పీఠలు ఎక్కడానికి మొహమాట పడుతున్నారు.

ఈ లిస్ట్ లో అడవి శేష్ కూడా ఒకరు. విభిన్న కథలతో సినిమాలు చేస్తూ, మంచి హిట్స్ అందుకుంటున్న అడవి శేష్, 37 ఏళ్లు వచ్చినా ఓ ఇంటి వాడు కాలేదు. దీనిపై అడవి శేష్ ను పలు వేదికలపై అడిగినా, సరైనా సమధానం ఇవ్వకుండా.. దాటేస్తూ వచ్చాడు. అయితే మేజర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పెళ్లి గురించి ప్రస్తావించగా, ’’ ఇండస్ట్రీలో మా ఫ్రెండ్స్ చాలా మంది పెళ్లి చేసుకోకుండా ఉన్నారు. ప్రభాస్, అనుష్క పెళ్లి తర్వాతే నేను చేసుకుంటాను’’ అని అన్నాడు.

- Advertisement -

’’ అమ్మాయిల నుండి ప్రపోజల్స్ కూడా చాలానే వస్తున్నాయి. పెళ్లైన వారు కూడా వచ్చి ప్రపోజ్ చేస్తున్నారు. ఇంట్లో అమ్మ కూడా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తుంది. కొరియన్ అమ్మాయి అయినా పర్లేదు చేసుకో’’ అంటుందని అన్నాడు. అయితే తాను పెళ్లి చేసుకోవడానికి ఇంకా టైమ్ ఉందని చెప్పి మరోసారి దాటేశాడు.

దీంతో అడివి శేష్ టాలీవుడ్ లో మరో ప్రభాస్ అవుతున్నాడంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు