Adivi Sesh : ఇక పాన్ ఇండియా సినిమాలే..

హీరోలు, దర్శకులు, నిర్మాతలు అందరి టార్గెట్ ఒకటే. సినిమా చేస్తే, పాన్ ఇండియా రేంజ్ లో ఉండాలి. చిన్న స్థాయి హీరో నుండి అగ్ర హీరో వరకు ఇప్పుడు ఇదే ఫాలో అవుతున్నారు. దర్శక నిర్మాతలు కూడా దీనికే ఓటు వేస్తున్నారు. కుర్ర హీరో అడివి శేషు కూడా ఇదే చేస్తున్నాడు. అడివి శేషు నుండి సినిమా వస్తుందంటే, అది తప్పక పాన్ ఇండియా సినిమాగానే ఉంటుంది.

అడివి శేషు కుర్ర హీరోనే కానీ, కంటెంట్ ఉన్న కుర్ర హీరో. దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు కోరుకుంటారో, ఆ సినిమాలనే చేస్తాడు. నిజానికి అడివి శేషు స్పై థ్రిల్లర్ నేపథ్యంలో సాగే సినిమాలే చేస్తాడు. ఈ సినిమాలకు సొంతగా స్టోరీని సిద్ధం చేసుకుంటాడు. అందుకే ధైర్యంగా పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలను విడుదల చేస్తాడు. సక్సెస్ ను అందుకుంటాడు.

ఈ యంగ్ హీరో ప్రస్తుతం HIT the second case సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కుంది. దీని తర్వాత గూఢచారి సీక్వెల్ చేయనున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించాలని అడివి శేషు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అందుకోసం ఇప్పటికే పనులు ప్రారంభించారట. గూఢచారి సీక్వెల్ సినిమా కూడా అందరూ మెచ్చే స్పై థ్రిల్లర్ జోనర్ లో రాబోతుంది. దీంతో మంచి హిట్ అందుకోవడం ఖాయమని చెప్పచ్చు.

- Advertisement -

దీని కంటే ముందు HIT the second case ను కూడా అడివి శేషు పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నాడు. ఇలా శేషు తనకంటూ ప్రత్యేక జోనర్ ను క్రియేట్ చేసుకుని, కేవలం పాన్ ఇండియా రేంజ్ లోనే విడుదల చేయడానికి రెడీ అవుతున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు