Bollywood: ఆదిపురుష్ రైటర్ హద్దు మీరాడు.. హనుమాన్ దేవుడే కాదంటున్నాడు?

ఆదిపురుష్ వివాదం రోజురోజుకి ముదురుతోంది. రామాయణ ఇతిహాస ఆధారంగా తీసిన ఈ సినిమా జూన్ 16 న విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన రోజు నుండి ఎదో ఒక వివాదం ఈ సినిమాను, ఇంకా చిత్ర యూనిట్ ని ఎన్నో ఇబ్బందులని గురి చేస్తుంది. దీనికి ఆ చిత్ర యూనిట్ లో అందరూ పూర్తి బాధ్యులు అయ్యారు. అసలే కథను వక్రీకరించి తీసారని అభిమానులు, రామ భక్తులు వీరిని విమర్శిస్తుంటే తప్పు ఒప్పుకోవాల్సింది పోయి సమర్ధించుకుంటూ పీకల దాకా తెచ్చుకుంటున్నారు.

ఆదిపురుష్ విడుదలయ్యాక మొదటిరోజు అభిమానుల అండతో బాగానే ఓపెనింగ్స్ వచ్చినా రెండో రోజునుండి మూవీ టీమ్ మొత్తానికి చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా రిలీజ్ కి ముందు సపోర్ట్ చేసిన రామ భక్తులే ఇప్పుడా సినిమాను బ్యాన్ చేయమని ఏకంగా పీఎం కి లేఖ రాసారు.

కానీ చిత్ర యూనిట్ మాత్రం ఇవేమి పట్టనట్టు ఉంది. ఈ సినిమా తీసిన ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమా అసలు రామాయణం కథ కానే కాదు అని బాంబు పేల్చారు. ఆదిపురుష్ సినిమా అసలు రామాయణానికి సంబంధించింది కాదని, ఆ సినిమాను ఆదర్శంగా తీసుకుని మాత్రమే ఈ సినిమా తీశామని చెప్పారు. దీనికి ఆగ్రహించిన అభిమానులు, రామ భక్తులు మరి రామాయణం కాదన్నపుడు సీతారాములు, హనుమాన్, లక్ష్మణుడు, రావణుడు పాత్రలు ఎందుకు తీసుకున్నావ్ అంటూ విమర్శిస్తున్నారు.

- Advertisement -

ఇదీ గాక ఆదిపురుష్ రైటర్ అయిన “మనోజ్ ముంతాషిర్ శుక్లా” హనుమాన్ పాత్ర మీద రాసిన డైలాగ్స్ గురించి మాట్లాడుతూ, తాను ఏమి తప్పుగా రాయలేదని, నిశితంగా ఆలోచించే సినిమాలో రాశానని, పాత్రల మధ్య వ్యత్యాసం చూపించడం కోసం సరళీకరించానని అన్నాడు.జానపద కళాకారులు రామాయణాన్ని వివరించేటప్పుడు ఇలాంటి సంభాషణల్నే వాడుతారు. వాళ్ళని అనరు గాని నన్ను అంటారు అని సమర్ధించుకున్నాడు.

ఇప్పుడు మళ్ళీ అంతకు మించిన దారుణమైన కామెంట్స్ చేసాడు మనోజ్ ముంతాషిర్ శుక్లా. తాజాగా ప్రముఖ ఛానల్ లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో హనుమాన్ అసలు దేవుడే కాదని వ్యాఖ్యానించాడు. ఆ
ఇంటర్వ్యూ లో మనోజ్ మాట్లాడుతూ హనుమంతుడు శ్రీరాముడిలా మాట్లాడరు. ఆయన తాత్వికంగా మాట్లాడరు. ఆయన అసలు భగవంతుడు కాదు, కేవలం రామ భక్తుడు. ఆ భక్తి వల్ల శక్తులు వచ్చాయి, అంతే కానీ ఆయన దేవుడు కాదు. మనమే ఆయన్ని దేవుడిని చేశాం అని అన్నాడు. ఈ వ్యాఖ్యలపై హనుమాన్ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొంతమంది భక్తులు మనోజ్ శుక్లా కి బెదిరింపు కాల్స్ చేస్తున్నారు.

మరి భక్తుల ఆగ్రహాన్ని చల్లార్చాల్సింది పోయి ఏకంగా రామాయణాన్ని , ఆంజనేయుడిని కించపరుస్తూ ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళని ఏమనాలి. ఏది ఏమైనా ఇలా తప్పుడు మాటలు మాట్లాడి తిరిగి వాటిని సమర్ధించుకుంటున్న రైటర్ మనోజ్ ముంతాషిర్ శుక్లా ని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇకనైనా చిత్ర యూనిట్ మేల్కొని ప్రేక్షకాభిమానులకు, భక్తులకు క్షమాపణ చెప్తే మంచిదని, లేదంటే వారి కెరీర్ ఇక్కడితో ముగిసినట్టేనని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు