Om Raut: తిరుమలలో కృతి సనన్ కి ముద్దుపెట్టిన ఆదిపురుష్ దర్శకుడు

ప్రభాస్ హీరోగా వస్తోన్న లేటెస్ట్ సినిమా ఆది పురుష్. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండగా, ఆయన సరసన కృతి సనన్… సీతమ్మ పాత్రలో నటించింది. సైఫ్ అలీ ఖాన్… రావణాసుడి రూపంలో ఉగ్రరూపం చూపించన్నాడు

ఈ సినిమాలో దాదాపు అందరూ బాలీవుడ్ నటులే యాక్టింగ్ చేశారు. ఇక ఈ సినిమా జూన్ 16వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ తరుణంలో నిన్న తిరుపతి వేదికగా ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో ప్రభాస్ తన పెళ్లి గురించి కూడా చెప్పడం గమనార్హం. ఇది ఇలా ఉండగా నిన్న ప్రి రిలీజ్ జరగగా, ఇవాళ చిత్ర బృందం శ్రీవారిని దర్శించుకుంది.

ఇందులో భాగంగా ఆదిపురుష్ సినిమా దర్శకుడు ఓం రౌత్, హీరోయిన్ కృతి సనన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే దర్శనం చేసుకున్న అనంతరం… కృతి సనన్ కు సెండ్ ఆఫ్ ఇస్తూ దర్శకుడు ఓం రౌత్ చేసిన పని ఇప్పుడు వివాదానికి తెరలేపింది. శ్రీవారి ఆలయ పరిసరాలలో ఉన్న సమయంలో… కృతి సనన్ కు హాగ్ మరియు కిస్ ఇచ్చాడు దర్శకుడు ఓం రౌత్. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో.. దర్శకుడు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు శ్రీవారి భక్తులు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు