Mega family: మెగా ఫ్యామిలీని తిడితే ఇండస్ట్రీలో అవకాశాలు రావా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఒక గుర్తింపు ఉన్నది.. చిరంజీవి స్వయంకృషితో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోగా ఆ తర్వాత.. పవన్ కళ్యాణ్ , నాగబాబు తదితర హీరోలు సైతం చిరంజీవిని ఇన్స్పైర్ గా తీసుకొని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ఆయన అండదండలతోనే స్టార్ హీరోలుగా ఎదిగారు.. ముఖ్యంగా చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ కూడా తన తండ్రి సహకారంతో స్టార్ హీరోగా ఎదిగారు. ఇప్పుడు తన ప్రతిభతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

మెగా సోదరులు..
మరోవైపు నాగబాబు హీరోగా ఫెయిల్ అవడంతో పవన్ కళ్యాణ్ మాత్రం హీరోగా బాగానే సక్సెస్ అయ్యారు.. అప్పటినుంచి ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.అంతేకాకుండా ప్రస్తుతం రాజకీయాలలో చురుకుగా పాల్గొంటున్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కమిట్ అయిన చాలా సినిమాలు సెట్స్ మీదే ఉన్నాయి. వీటన్నింటిని ఈ ఏడాది పూర్తి చేసి విడుదల చేయాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తున్నది. ఇదంతా ఇలా ఉండగా మెగా కుటుంబంలోని హీరోలని తిట్టిన కొంతమంది నటులకు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా పోయాయనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి..

మెగా కుటుంబం దెబ్బకి అవకాశాలు కోల్పోయిన నటులు..
అలాంటి వారిలో ముఖ్యంగా శ్రీ రెడ్డి ఒకరని చెప్పవచ్చు.. అందుకే ఈమె ఎప్పుడు కూడా మెగా కుటుంబం పై ఏదో ఒక విషయం మీద ఫైర్ అవుతూ ఉంటుంది.. ముఖ్యంగా పోసాని కృష్ణ మురళి కూడా గతంలో మెగా కుటుంబం పైన చేసిన వ్యాఖ్యల వల్ల పోసాని ఇంటి పై మెగా ఫ్యాన్స్ రాళ్లు విసిరి నానా రచ్చ చేశారు. అంతేకాకుండా అవకాశాలు కూడా రాకుండా చేశారు. నటుడు పృథ్వీరాజ్ కూడా మెగా కుటుంబాన్ని నానా మాటలు అనడంతో కొన్నేళ్లు అవకాశాలు రాలేదు.. కానీ ఆ తర్వాత జనసేన పార్టీలోకి వెళ్లడంతో అవకాశాలు ఇస్తూ ఆయనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు.

- Advertisement -

మెగా కుటుంబం – మంచు కుటుంబం మధ్య వార్..
మరోవైపు గత కొన్నేళ్లుగా మెగా కుటుంబం – మంచు కుటుంబం మధ్య ఒక కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది.. అంతేకాకుండా మెగా కుటుంబ సభ్యులే మంచు కుటుంబాన్ని ట్రోల్ చేయిస్తున్నారంటూ మంచు విష్ణు కూడా ఎన్నోసార్లు తెలియజేశారు.. అందుకే ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్లు కూడా ఎవరైనా మెగా కుటుంబాన్ని వ్యతిరేకించారు అంటే వారికి అవకాశాలు ఇవ్వకుండా చేస్తూ ఉంటారనే వార్తలైతే వినిపిస్తూ ఉంటాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయం అయితే వైరల్ గా మారుతూ ఉంది.

మెగా ఫ్యామిలీ..
ఇక మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే.. ఈ ఫ్యామిలీ నుంచి ఏకంగా 10 మందికి పైగా హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అలాగే 7కి పైగా ప్రొడక్షన్ సంస్థలు ఉన్నాయి.. ఇక సినీ ఇండస్ట్రీలోనే అతిపెద్ద ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకుంది మెగా ఫ్యామిలీ.. ఈ నేపథ్యంలోనే ఈ కుటుంబాన్ని ఎవరైనా గెలికితే ఇక వారికి అవకాశాలు లేవు అనడంలో సందేహం లేదు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు