World’s Sleep Day 2024 : ప్రపంచ నిద్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

ఈరోజు వరల్డ్ స్లీప్ డే. స్లీపింగ్ ఇంపార్టెన్స్ ను తెలియజేయడానికే ప్రతి సంవత్సరం మార్చి 15న ప్రపంచ నిద్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవడం చాలా ముఖ్యం. నిద్ర లేకపోవడం వల్ల డయాబెటిస్ వంటి ఎన్నో ప్రమాదకర జబ్బులు వస్తాయి. ప్రతిరోజు 5 గంటలు మాత్రమే నిద్రపోయే వారిలో బ్లడ్ షుగర్ ముప్పు 16% పెరుగుతుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. 4 గంటల కంటే తక్కువ నిద్రపోయే వారిలో డయాబెటిస్ వచ్చే ప్రమాదం 41 శాతం పెరుగుతుందట. మరి ఇంతకీ నిద్ర దినోత్సవం చరిత్ర ఏంటి? ఈ ఇయర్ థీమ్ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే….

వరల్డ్ స్లీప్ డే ఎందుకు?
ఒకప్పుడు ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధగా వ్యవహరించేవారు. కానీ ప్రస్తుతం చాలామంది తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడానికి సమయాన్ని కేటాయించలేనంతగా అవసరాల కోసం పరుగులు తీస్తూనే ఉన్నారు. ఈ డిజిటల్ యుగంలో ఆఫీసులు మొదలుకొని కాలేజీల్లో కూడా రోజంతా మొబైల్స్, ల్యాప్టాప్ లు వాడుతూ గడిపేస్తున్నారు. దీనివల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ఎఫెక్ట్స్ పడుతుంది. చిన్న వయసులోనే అలసట, బలహీనత వంటివి మొదలవుతాయి. ముఖ్యంగా నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. విపరీతమైన అలసట కారణంగా తక్కువగా నిద్ర పడుతుంది. సరిగ్గా నిద్ర పోకపోతే నెక్స్ట్ డే ఫ్రెష్ గా స్టార్ట్ చేయలేము. ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రజలకు స్లీపింగ్ ఇంపార్టెన్స్ ఏంటో తెలియజేయడానికే ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది మార్చ్ 15న ప్రపంచ నిద్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు.

వరల్డ్ స్లీప్ డే చరిత్ర ఇదే…
తీవ్రమైన నిద్ర సమస్యలతో బాధపడుతున్న వారికి సహాయం చేయాలనే లక్ష్యంతో వరల్డ్ స్లీప్ సొసైటీ 2008లో వరల్డ్ స్లీప్ డే ను సెలబ్రేట్ చేయడం మొదలు పెట్టింది. ఈ కమిటీ స్లీప్ మెడిసిన్, స్లీప్ రీసెర్చ్ రంగంలో ప్రజల ఆరోగ్యం గురించి అధ్యయనం, పరిశోధనలు చేస్తారు. సాధారణంగా ఫిట్ గా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. తగినంత నిద్ర పోవడం కూడా అంతే ముఖ్యం. నగరాల్లో బిజీ లైఫ్ స్టైల్ కారణంగా చాలామంది రాత్రి పూట సరిగ్గా నిద్రపోవట్లేదు. దానివల్ల శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కోవలసి వస్తోంది. ఈ సమస్యలకు పరిష్కారం కనుగొనడానికే వరల్డ్ స్లీప్ సొసైటీ స్లీప్ డే ని స్టార్ట్ చేసింది. 2008లో తొలిసారిగా స్లీప్ డే ను సెలబ్రేట్ చేయగా, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 88 కంటే ఎక్కువ దేశాలే వరల్డ్ స్లీప్ డేను జరుపుకుంటున్నారు.

- Advertisement -

వరల్డ్ స్లీప్ డే 2024 థీమ్ ఇదే…
2024 వరల్డ్ స్లీప్ డే థీమ్ “స్లీప్ ఈక్విటీ ఫర్ గ్లోబల్ హెల్త్”. అంటే దీని అర్థం ఆరోగ్యంగా ఉండడానికి నిద్ర చాలా ముఖ్యం. బిజీ లైఫ్ స్టైల్, ఒత్తిడి కారణంగా నిద్ర సమస్యలతో బాధపడుతున్న జనాలు ఈజీగా అనారోగ్యానికి గురవుతున్నారు. దానివల్ల వచ్చే వ్యాధుల నుంచి ప్రజలను రక్షించడానికి, అవగాహనను పెంచడానికి ఈరోజును కేటాయిస్తారు. బాగా నిద్ర పట్టాలంటే పడుకునే గది, బెడ్, దిండు శుభ్రంగా ఉండాలి. పడుకునే ముందు ఫోన్, లాప్టాప్ వంటి వాటిని దూరం పెట్టేయాలి.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు