Actress : బాయ్ ఫ్రెండ్ కావాలి

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న సురేఖ వాణి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో సినిమాలలో పద్ధతికి చీర కట్టినట్టుగా చాలా సాంప్రదాయంగా అత్తగా, అమ్మగా, అక్కగా, వదినగా ఇలా పలు ముఖ్యమైన పాత్రలు చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. సినిమాలలో ఎంతో పద్ధతిగా కనిపించే సురేఖ వాణి బయట మాత్రం చాలా బోల్డ్ గా ఉంటుంది.

ఈ మధ్యకాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉన్న సురేఖ వాణి సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్ గా ఉంటుంది. ఇక కూతురు సుప్రీతతో కలిసి నెట్టింట చేసే రచ్చ అంతా ఇంతా కాదు. గ్లామరస్ ఫోటోలతో తల్లి కూతుర్లు తెగ హంగామా చేస్తుంటారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వీరిద్దరూ పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. త్వరలో సురేఖ వాణి పెళ్లి చేసుకోబోతున్నారా అని యాంకర్ ప్రశ్నించగా, అందుకు సుప్రీత అవుననే సమాధానం ఇచ్చింది.

అమ్మకు పెళ్లి చేస్తానంటూ సుప్రీత బదులిచ్చింది. ఇక రిలేషన్ షిప్ స్టేటస్ ఏంటి? ఇద్దరు సింగిలా అని అడగ్గా.. ప్రస్తుతానికి అవునని, ‘కానీ మాకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి’ అంటూ సురేఖ వాణి పేర్కొంది. అంతేకాకుండా బాయ్ ఫ్రెండ్ కి ఉండాల్సిన క్వాలిటీస్ కూడా రివిల్ చేసింది. అయితే ‘నువ్వు చెప్పే క్వాలిటీ ఆయనలో లేవేంటి మమ్మీ’ అంటూ సుప్రీత కొంటెగా ప్రశ్నించగా ఇలాంటివి చెప్పొద్దంటూ సురేఖ వాణి నోరు కట్టేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు