Pooja Hegde: గడ్డు పరిస్థితి అనుభవిస్తుందా..?

ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా.. అన్ని భాషలలో ఐరెన్ లెగ్ అనే ట్యాగ్ తెచ్చుకున్న హీరోయిన్ ఎవరూ అంటే.. వెంటనే పూజా హెగ్డే పేరు చెబుతారు. కెరీర్ ప్రారంభం నుంచే ఈ బుట్టబొమ్మకు ఈ ఐరెన్ లెగ్ ట్యాగ్ వచ్చింది. ఈమె తమిళం, తెలుగు, హిందీలో డెబ్యూ సినిమాలు దారుణమైన ఫలితాన్ని ఇచ్చాయి. అయినా, పూజా హెగ్డే అందానికి, అభినయానికి వరుసగా అవకాశాలు వచ్చాయి. కానీ, పెద్దగా హిట్స్ అయితే రాలేకపోయాయి. ఇప్పటి వరకు పూజా హీరోయిన్ గా 16 సినిమాలు చేసింది. అందులో కేవలం 5 మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.

ఇటీవల ఈమె కనిపించిన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, సర్కస్ సినిమాలు డిజాస్టార్ గా మిగిలాయి. బ్యాక్ టు బ్యాక్ నాలుగు సినిమాలు నిరాశపరచడంతో, ఐరెన్ లెగ్ ట్యాగ్ మరోసారి గట్టిగా వినిపించింది. ఇందులో బాలీవుడ్ మూవీ సర్కస్ పరిస్థితి అయితే అత్యంత దారుణమని చెప్పొచ్చు. దాదాపు 150 కోట్ల నుంచి 160 కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద కేవలం 60 కోట్ల కలెక్షన్లు ను మాత్రమే రాబట్టింది.

దీని తర్వాత ఈ బుట్టబొమ్మకు అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో కిసీ కా భాయ్ కిసీ కి జాన్, టాలీవుడ్ లో మహేష్ బాబుతో SSMB28 సినిమాలు మాత్రమే చేస్తోంది. ఈ రెండు సినిమాలకు చాలా రోజుల కిందటే సైన్ చేసింది. కొత్తగా ఒక్క అవకాశం కూడా రావడం లేదు. దీంతో తన రెమ్యునరేషన్ ను కూడా తగ్గించుకుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు పూజా హెగ్డే ఒక్కో సినిమాకు దాదాపు 3 కోట్ల నుంచి 3.5 కోట్ల వరకు పారితోషికం తీసుకునేది. కానీ, ప్రస్తుతం ఈమె గడ్డు పరిస్థితుల్లో ఇలాంటి రెమ్యునరేషన్ ఉంటే అవకాశాలు రావడం కష్టమే అని భావించిదట.

- Advertisement -

అందుకే తన పారితోషికాన్ని భారీగా తగ్గించిందని గుస గుసలు వినిపిస్తున్నాయి. అయినా, ఈ బుట్టబొమ్మకు పెద్దగా అవకాశాలు రావడం లేదని సమాచారం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. కొన్ని రోజుల్లోనే కెరీర్ కు పులిస్టాప్ పడే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు