Megastar: చిరు ఇప్పుడైనా పూరీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా..?

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇస్తున్నారు అనగానే స్టార్ డైరెక్టర్స్ నుండి అప్ కమింగ్ డైరెక్టర్ల వరకూ అందరూ ఆయన్ను ఉద్దేశించి కథలు రాసుకొని సిద్ధంగా ఉన్నారు. అయితే, ఖైదీ నెంబర్ 150 తో దర్శకుడు వీవీ వినాయక్ ను ఆ అదృష్టం వరించింది. ఈ సినిమాకు ముందు దర్శకుడు పూరీ జగన్నాథ్ రూపొందించిన ‘ఆటో జానీ’ కథతో మెగాస్టార్ రీఎంట్రీ ఉండబోతోంది అంటూ వార్తలొచ్చాయి.  అయితే, పూరీ సిద్ధం చేసిన కథ చిరుకి నచ్చకపోవటం వల్ల ఈ కాంబినేషన్ కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత సైరా, ఆచార్య అంటూ ఒకటి తర్వాత ఒకటి సినిమాలు అనౌన్స్ చేస్తూ స్పీడ్ పెంచారు మెగాస్టార్. దీంతో పూరీ, చిరుల కాంబినేషన్ ఇక లేనట్లే అని ఫిక్స్ అవ్వాల్సి వచ్చింది.

ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాలో పూరీ ఒక స్పెషల్ రోల్ లో మెరవటంతో ఈ క్రేజీ కాంబినేషన్ పై మళ్ళీ ఆశలు చిగురించాయి. ఆ సినిమా ప్రమోషన్ సమయంలో చేసిన ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి స్వయంగా ఆటోజానీ సినిమా ఏమైందని అడగటం, అందుకు సమాధానంగా పూరీ ఆటోజానీ ని మించిన కథతో మీ ముందుకు వస్తాను అంటూ అనటం ఈ కాంబినేషన్ పై ఆశలు సజీవంగా ఉంచాయి. చిరంజీవి నుండి అనౌన్స్మెంట్ కి మాత్రమే పరిమితమైన సినిమాలు ఆటోజానీ ఒక్కటే కాకుండా త్రివిక్రమ్, రాజమౌళిలతో కూడా చేస్తానంటూ అనౌన్స్ చేసి ఆపై వాటి గురించి ఊసే లేకుండా పోయింది.

డీవీవీ దానయ్య బ్యానర్ లో వెంకీ కుడుములు డైరెక్షన్లో రావాల్సిన చిరు సినిమా కూడా దాదాపు అటకెక్కినట్లే అన్న టాక్ వినిపిస్తోంది. పూరీ, చిరుల కాంబినేషన్లో సినిమా కోసం ఫాన్స్ కూడా ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలు అనుకున్నంత స్థాయిలో అలరించకపోవటమే ఇందుకు కారణం. చిరంజీవికి మాత్రమే సాధ్యమైన యూనిక్ కామెడీ టైమింగ్ అండ్ బాడీ లాంగ్వేజ్ ను స్క్రీన్ పై చూడటం కోసం ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. మొన్న వచ్చిన వాల్తేరు వీరయ్యతో ఆ ఆశ కొంతవరకు తీరినప్పటికీ పూరీ డైరెక్షన్లో చిరు సినిమా పడితే అది ఇంకో లెవెల్లో ఉంటుందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు