Deshamuduru: అప్పుడు బ్లాక్ బస్టర్ – ఇప్పుడు వసూళ్లు డల్..!

ఎలా, ఎందుకు మొదలైందో తెలీదు కానీ, ప్రస్తుతం  రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది టాలీవుడ్ ఇండస్ట్రీలో. ఎదో ఒక స్పెషల్ అకేషన్ చూసుకొని తమ అభిమాన హీరోల పాత సినిమాలను రీమాస్టర్ చేయించి బిగ్ స్క్రీన్ పై చూసుకొని మురిసిపోతున్నారు అభిమానులు. ఒక్కడు సినిమాతో మొదలైన ఈ పరంపర తాజాగా విడుదలైన దేశముదురు వరకు కొనసాగుతూనే ఉంది. ఇప్పటిదాకా రీరిలీజ్ అయిన సినిమాలన్నీ మంచి కలెక్షన్లు రాబట్టాయి ఆఖరికి అప్పట్లో పెద్ద డిజాస్టర్ అయిన రామ్ చరణ్ సినిమా ఆరెంజ్ కూడా ఇటీవల రీరిలీజ్ చేయగా బ్లాక్ బస్టర్ రేంజ్ లో కలెక్షన్లు కొల్లగొట్టింది.

ఇదిలా ఉండగా, ఈ ట్రెండ్ ను ఫాలో అవుతూ అల్లు అర్జున్ నటించిన సూపర్ హిట్ దేశముదురు సినిమాను కూడా రీరిలీజ్ చేసారు. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సిక్స్ ప్యాక్ తో అల్లు అర్జున్ టాలీవుడ్ కి కొత్త ట్రెండ్ పరిచయం చేస్తే, దర్శకుడు పూరీ జగన్నాథ్ టేకింగ్, చక్రి వైవిధ్యమైన సంగీతం ఇప్పటికి కూడా యూత్ ని ఉర్రూతలు ఉగిస్తున్నాయి. రీరిలీజ్ తర్వాత ఈ సినిమాకు కలెక్షన్స్ ఆశించినంతగా లేకపోవటం చుస్తే ఆశ్చర్యంగా ఉంది. ఆరెంజ్ సినిమా రీరిలీజ్ వర్షన్ కు వచ్చిన ఓపెనింగ్స్ తో పోల్చితే దేశముదురు పరిస్థితి దారుణంగా ఉందని టాక్.

మరో పక్క ఈ సినిమాకు కలెక్షన్లు పెంచేందుకు అల్లు అర్జున్ పీఆర్ వర్గం ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ  వర్కౌట్ అవ్వట్లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు ఆశించిన లెవెల్లో కలెక్షన్స్ లేకపోవటానికి కారణం పబ్లిసిటీ లేకపోవటమే అని అనిపిస్తోంది.  పైగా ప్రస్తుతం నాని నటించిన దసరా సినిమా మంచి జోష్ తో థియేటర్లలో నడుస్తూ ఉండటం కూడా మరో కారణంగా చెప్పొచ్చు. సరైన టైమ్ చూసి ఈ సినిమాను రీరిలీజ్ చేసుంటే మంచి కలెక్షన్స్ వచ్చి ఉండేవి. ఇక ముందైనా సినిమాలను రీరిలీజ్ చేసే టైమ్ లో ఇలాంటి పొరపాటు పునరావృతం కాకుండా చూసుకుంటే మంచిది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు