Salaar: బాహుబలి హైపు.. RRR రేటు.. మరి ఆ రికార్డు కొట్టగలడా?

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న “సలార్” మరో వారం రోజుల్లో థియేటర్లలో సందడి చేయనున్న విషయం తెలిసందే. అసలు ఈ సినిమా అనౌన్స్ మెంట్ అయినప్పటినుండే ఆడియన్స్ లో భీభత్సమైన అంచనాలు పెరిగాయని తెలిసిందే. పైగా సినిమా స్టార్ట్ అయ్యి రెండేళ్ల పైనే అయినా సినిమా నుండి అప్పుడప్పుడూ ఎదో బ్లాక్ అండ్ వైట్ స్టిల్స్ తప్ప మరే అప్డేట్ కూడా రాకపోయినా కాంబినేషన్ హైప్ తోనే సోషల్ మీడియాలో రచ్చ చేసారు ఫ్యాన్స్.

ఇక సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్ లో సగం సేపే ప్రభాస్ కనిపిస్తాడు. అయినా కూడా ప్రశాంత్ నీల్ తన మార్క్ ఎలివేషన్లతో సినిమాపై అంచనాలు పెంచేసాడు. నిజానికి ఈ సినిమాపై చేసిన ప్రమోషన్లు కూడా చాలా తక్కువ. అయినప్పటికీ బాహుబలి రేంజ్ హైప్ ఈ సినిమాకి వచ్చింది. ఇక థియేటర్లలో ఉన్న హైప్ కి తగ్గట్టు మేకర్స్ టికెట్ రేట్లు కూడా భారీగా పెంచేశారు.

టికెట్ ప్రైస్ ఏ రేంజ్ లో ఉన్నాయంటే ఇంతకు ముందు RRR కి తప్ప మరె సినిమాకి అంత రేట్లు పెట్టలేదు. సలార్ సినిమాకి సింగిల్ స్క్రీన్స్ లో 230 నుండి 270 వరకు, ఇక మల్టీప్లెక్స్ లో 400 వరకు రేటు పెంచి విక్రయిస్తున్నారు బయ్యర్లు. దీంతో సలార్ రికార్డులపై ఇప్పట్నుంచే చర్చ మొదలైంది. అయితే రికార్డుల విషయంలో ప్రస్తుతానికి ఒక్క టాపిక్ పైనే అందరూ మాట్లాడుతున్నారు. అదే ఫస్ట్ డే రికార్డ్ ఓపెనింగ్స్ గురించి.

- Advertisement -

ఇంతవరకు ఇండియన్ సినిమాల్లో ఫస్ట్ డే ఓపెనింగ్స్ లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన తొలి రెండు సినిమాలు బాహుబలి 2, RRR. ఈ రెండు సినిమాలు ఫస్ట్ డే 200 కోట్లకి పైగా వసూలు చేసాయి. RRR మొదటి రోజు 243 కోట్ల ఓపెనింగ్స్ సాధించగా, బాహుబలి ది బిగినింగ్ 223 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. ఇక ఇప్పుడు రిలీజ్ అయ్యే సలార్ కి బాహుబలి రేంజ్ హైప్ తో పాటు RRR స్థాయిలో రేట్లు కూడా పెడుతున్నారు. మరి ప్రభాస్ బాహుబలి తరువాత ఆ రేంజ్ హైప్ తో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ డే కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందా? 200 కోట్ల ఓపెనింగ్స్ ని సాధిస్తుందా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

ట్రేడ్ విశ్లేషకుల లెక్కల ప్రకారం సలార్ టాలీవుడ్ లో ఆల్ టైం రికార్డు ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే తమిళ్, మలయాళం, కన్నడలో యావరేజ్ ఓపెనింగ్స్ దక్కే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే సలార్ కి ఇతర భాషల్లో పెద్దగా ప్రమోషన్లు చేయకపోగా, కన్నడ, హిందీలో ఆయా భాషలకు సంబంధించి స్టార్ హీరోల సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి 200 కోట్లకి అటు ఇటుగా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి సలార్ ఏ స్థాయి ఓపెనింగ్స్ దక్కించుకుంటుందో తెలియాలంటే డిసెంబర్ 22 వరకు వెయిట్ చేయాలి.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు