Vishwambhara: చిరు లేకుండానే ఆ సీక్వెన్స్ ప్లానింగ్!

Vishwambhara Movie

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో “విశ్వంభర” ఒకటి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తుండగా, బింబిసార ఫేమ్ వశిష్ఠ భార్గవ దర్శకత్వం వహిస్తున్నాడన్న విషయం తెలిసిందే. సోసియో ఫాంటసీ చిత్రం గా తెరకెక్కుతున్న ఈ సినిమా 200 కోట్లకి పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారని మేకర్స్ చెప్పడం జరిగింది. లాస్ట్ ఇయర్ దసరా తర్వాత ఓపెనింగ్ జరుపుకున్న ఈ సినిమా డిసెంబర్ లో షూటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది.

అయితే జనవరిలో సంక్రాంతి పండగ వల్ల కొన్ని రోజులు షూటింగ్ కి బ్రేక్ రాగా, రిపబ్లిక్ డే సందర్బంగా మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ వరించడంతో ప్రముఖ సినీ, రాజకీయ సెలెబ్రిటీలు చిరును కలవడం వల్ల మరికొంత బ్రేక్ వచ్చింది. అయితే ఫైనల్ గా విశ్వంభర షూటింగ్ తాజాగా మొదలైంది. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ఈ సినిమాలో కొన్ని కీలకమైన ఫైట్ సీన్లను షూట్ చేస్తున్నట్టు తాజాగా మేకర్స్ ప్రకటించడం జరిగింది. అయితే చిరంజీవి మాత్రం మరి కొన్ని రోజులయ్యాక సెట్స్ లో అడుగుపెడతారు.

ఇక చోట కె నాయుడు సినిమాటోగ్రఫీ ఇస్తుండగా ఎం.ఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో అన్ని పాటలు చంద్రబోస్ రాస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇతర నటీనటుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వచ్చే 2025 సంక్రాంతికి విశ్వంభర విడుదల కానుంది.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు