కోలీవుడ్ స్టార్ హీరో త్రిష కు రోజు రోజుకు ఫుల్ డిమాండ్ పెరుగుతుంది. వరుసగా కొత్త ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ యంగ్ హీరోయిన్స్ కు పోటీగా నిలుస్తోంది. నిజానికి కొన్ని రోజుల క్రితం త్రిషకు కోలీవుడ్ తో పాటు ఏ ఇండస్ట్రీలో కూడా పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ మణిరత్నం దర్శకత్వంలో హిస్టారికల్ యాక్షన్ సినిమా పొన్నియన్ సెల్వన్ లో త్రిష నటించిన నాటి నుంచి తన కెరీర్ మరోసారి మలుపు తిరిగింది.
ఈ సినిమాలో త్రిష నటనకు, అభినయానికి ప్రేక్షకులే కాదు.. దర్శక నిర్మాతలు కూడా ఫిదా అయిపోయారు. అందుకే ఈ స్టార్ హీరోయిన్ కు వరుస పెట్టి అవకాశాలు ఇస్తున్నారు. ఇప్పటికే త్రిష అరవింద్ స్వామితో “సతురంగ వెట్టై 2”, మోహన్ లాల్ తో “రామ్” తో పాటు లేడి ఓరియంటెడ్ సినిమా “ది రోడ్” లో నటిస్తోంది. అలాగే పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 కూడా ఈమె చేతిలో ఉంది. వీటితో పాటు విజయ్ దళపతి – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా, అజిత్ – విఘ్నేష్ శివన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాల్లో అవకాశాన్ని దక్కించుకుంది.
Read More: Guntur Kaaram: డైరెక్షన్ మానేసి పర్యవేక్షణ మాత్రమే చేసుకో గురూజీ..!
తాజాగా ఈ స్టార్ హీరోయిన్ మరో క్రేజీ ఆఫర్ ను కొట్టేసినట్టు సమాచారం. లోకనాయకుడు కమల్ హాసన్ తో త్రిష ఛాన్స్ దక్కించుకున్నట్టు కోలీవుడ్ వర్గాల్లో గట్టిగా ప్రచారం సాగుతుంది. కమల్ హాసన్ తో స్టార్ డైరెక్టర్ మణి రత్నం ఓ భారీ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తున్నాడు. కమల్ హాసన్ – మణిరత్నం కాంబినేషన్ లో చివరిగా 35 ఏళ్ల క్రితం నాయకుడు అనే సినిమా వచ్చింది. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.
ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లో హీరోయిన్ పాత్ర కోసం త్రిష పేరును డైరెక్టర్ మణిరత్నం పరిశీలిస్తున్నారట. త్రిష ను మణిరత్నం తన పొన్నియిన్ సెల్వన్ సినిమాతో డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనిలో కుందవాయి దేవి పాత్రలో త్రిష చేసిన ఫర్మామెన్స్ మణిరత్నంకు బాగా నచ్చిందట. అందుకే కమల్ హాసన్ ప్రాజెక్ట్ లో త్రిషను ఫైనల్ చేయబోతున్నట్టు టాక్.
Read More: GandeevaDhari Arjuna: ఈ వారం 4 సినిమాలు.. కానీ ఆడియన్స్ చూపు దానిపైనే?
కాగా త్రిష ఇప్పటికే కమల్ హాసన్ తో మన్మథ బాణం, చీకటి రాజ్యం సినిమాల్లో నటించింది. తాజాగా మరోసారి కమల్ హాసన్ తో నటిస్తే.. వారి కాంబినేషన్ మూడో సారి సెట్ అవుతుంది అన్నమాట. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. కానీ త్వరలోనే డైరెక్టర్ మణిరత్నం ఈ ప్రాజెక్ట్ గురించి, త్రిష గురించి అధికారిక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్...
టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా...
తేజ దర్శకత్వంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి...
నేహా శెట్టి.. ఈ పేరుకంటే రాధిక అని పిలిస్తేనే...
ప్రస్తుతం చెన్నైలో మిచౌంగ్ తుఫాన్ తో...