Tollywood: హర్రర్ కాన్సెప్ట్స్ కి పెరుగుతున్న గిరాకీ?

టాలీవుడ్ లో ఈ మధ్య హర్రర్ నేపథ్యమున్న చిత్రాలపై మేకర్స్ బాగానే ఫోకస్ పెట్టారని అనిపిస్తుంది. ఇంతకు ముందు హర్రర్ చిత్రాల్లో ఎక్కువగా పరభాషా సినిమాలే తెలుగులో సందడి చేసేవి. తెలుగులో డైరెక్టర్లు తీసినా అందులో ఎక్కువగా కామెడీ జోనర్ సినిమాలే ఉండడంతో ఆడియన్స్ పెద్దగా యాక్సప్ట్ చేసేవారు కాదు. నిజం చెప్పాలంటే ప్యూర్ తెలుగు హర్రర్ సినిమాలొచ్చి చాలా కాలమైంది.

కానీ టాలీవుడ్ మేకర్స్ కి ఈ విషయం బాగానే అర్ధమైనట్టుంది. అందుకే వరుస బెట్టి హర్రర్ సినిమాలొస్తున్నాయి. ఈ ఇయర్ లోనే గత కొన్ని నెలల కింద హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన “విరూపాక్ష” సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తాజాగా చేతబడుల నేపథ్యంలో తెరకెక్కిన హర్రర్ థ్రిల్లర్ పొలిమేర2. ఈ సినిమా విరూపాక్ష ని మించి సాలిడ్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతుంది.

Satyam Rajesh:పొలిమేర2 ఫస్ట్ డే కల్లెక్షన్స్.. అన్ని అంచనాలని మించిపోయింది!

- Advertisement -

ఇక ఇదే కోవలో మరో రెండు హర్రర్ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న “ఊరు పేరు భైరవకోన”, అలాగే అజయ్ భూపతి దర్శకత్వం లో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తున్న “మంగళవారం”. ఈ రెండు కూడా హర్రర్ కాన్సెప్ట్స్ తో తెరకెక్కగా, నవంబర్ 17న మంగళవారం రిలీజ్ కి రెడీ అవుతుంది. ఊరు పేరు భైరవకోన ఇంకా రిలీజ్ డేట్ కంఫర్మ్ చేసుకోలేదు.

అయితే హర్రర్ నేపథ్యమున్న ప్రతి సినిమా ఆడాలనేమి లేదు. కంటెంట్ బాగుంటేనే ఆడియన్స్ ఆదరిస్తారు. మరి ఈ నవంబర్ 17న రిలీజ్ అయ్యే మంగళవారం ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు