Skanda: డ్యామేజ్ కంట్రోల్ చేద్దామనుకుని మరింత చేస్తున్నాడా?

టాలీవుడ్ లో నెలన్నర కింద రిలీజ్ అయిన “స్కంద” సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బోయపాటి రామ్ పోతినేని కాంబో లో వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయింది. మామూలుగానే బోయపాటి సినిమాల టీజర్ తోనే విషయం ఆడియన్స్ కి అర్ధమైపోతుంది. బాలయ్య కి తప్ప ఎవ్వరికీ బోయపాటి సినిమాలు సూట్ కావన్న పేరు కూడా ఉంది.

అయినా సరే రామ్ పోతినేని రిస్క్ చేసి సినిమా చేసాడు. ఇక రిజల్ట్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సింపుల్ గా చెప్పాలంటే ఈ ఇయర్ స్కంద సినిమా మేమెర్స్ కి, ట్రోలర్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చిందని చెప్పొచ్చు.

అయితే ఇంత జరిగిన తర్వాత కూడా రామ్ పోతినేని అయిన డ్యామేజ్ ని రిపేర్ చేద్దామని ట్రై చేద్దామని చూస్తున్నాడు. ఆ ప్రయత్నంలో అంతకు మించి ట్రోలర్లకి అడ్డంగా బుక్కవుతున్నాడు.

- Advertisement -

Skanda: తెలుగులో పోయిన పరువు చాలదనా? అన్నింట్లోనూ రుద్దుతున్నారు!

అసలు విషయానికి వస్తే రామ్ లేటెస్ట్ గా స్కంద గురించి వేసిన ట్వీట్ వైరల్ అయింది. ఆ ట్వీట్ లో ఏముందంటే…

“22.04.23 నాకు ఇంకా గుర్తుంది..వేసవిలో అత్యంత వేడిగా ఉండే రోజులలో.. 25 రోజుల షెడ్యూల్ లో 3వ రోజు ఈ ఎపిసోడ్‌ని షూట్ చేసిన తర్వాత ఇవి నా అడుగులు..సరిగ్గా నడవలేక..వెళ్లిపోయాను”.

“రక్తం కూడా కారింది. కాబట్టి నా డైరెక్టర్ బోయపాటి షాట్‌ను సరిగ్గా తీయాలనుకున్నాడు, అందుకే కొన్ని షాట్స్ సరిగా తీయడం కోసం ఆయన తన కాలుని కూడా స్వయంగా కాల్చుకున్నాడు.
కంటెంట్‌ను ఇష్టపడడం, ఇష్టపడకపోవడం అనేది పూర్తిగా ప్రేక్షకుల ఎంపిక..నేను మీ అభిప్రాయాలను గౌరవిస్తూనే ఉంటాను”, అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.

అయితే ఈ పోస్ట్ చేసింది, సోషల్ మీడియా లో బోయపాటి పై వస్తున్న ట్రోల్స్ కి సమాధానంగా.. దీనిపై ఆడియన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇప్పటివరకూ డైరెక్టర్ నే ట్రోల్ చేసిన ఆడియన్స్, ఇప్పుడు ఇది కవర్ చేస్తున్న రామ్ ని కూడా వేసుకోవడం మొదలెట్టారు.

ఏది ఏమైనా జరిగిన స్కంద డ్యామేజ్ ని ఎంత కవర్ చేయడానికి ప్రయత్నిస్తే అంత ట్రోల్ చేస్తారు. అందుకే దీని గురించి పట్టించుకోవద్దని రామ్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా లో కామెంట్స్ పెడుతున్నారు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు