టాలీవుడ్ హీరోలను డైరెక్టర్స్ బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కన్ఫ్యూజన్ లో మన హీరోలు ఎక్కువ డిజాస్టర్లు కొడుతున్నారు. వివరాల్లోకి వెళితే…
ఇటీవల కాలంలో టాలీవుడ్ లో యంగ్ డైరెక్టర్స్ అంతా తమ టాలెంట్ ను బాగా బయటపెడుతున్నారు. అనిల్ రావిపూడి వంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ ఒక్క ప్లాఫ్ కూడా లేకుండా తెలివిగా, నెమ్మదిగా సినిమాలను చేసుకుంటూ దూసుకెళ్తున్నారు. అయితే కొంతమంది డైరెక్టర్స్ మాత్రం చెప్పిన దానికి, చేసే దానికి పొంతన లేకుండా హీరోలకు డిజాస్టర్లు ఇస్తున్నారు. వాళ్లు హీరోలకు కథ చెప్పేటప్పుడు నెక్స్ట్ రేంజ్ అనేలా చెబుతున్నారు. దీంతో హీరోలు హోప్స్ అన్నీ ఆయా సినిమాలపై పెట్టుకుని నటిస్తున్నారు. తీరా సినిమాలు రిలీజ్ అయ్యాక ప్లాఫ్ లు వచ్చి పడుతున్నాయి. ఆ విధంగా హీరోలకు నేరేషన్ చేసేటప్పుడు డైరెక్టర్ తమ టాలెంట్ ను చూపిస్తున్నారు. కానీ తీరా సిల్వర్ స్క్రీన్ పై వాళ్ళను ప్రెజెంట్ చేయడంలో, చెప్పినట్టుగా వాళ్ళను చూపించడంలో, కథను తెరకెక్కించడంలో తడబడుతున్నారు. దీంతో హీరోలు అడ్డంగా బుక్ అయిపోతున్నారు.
రీసెంట్ గా డిజాస్టర్ అయిన కొన్ని సినిమాలే అందుకు నిదర్శనం. ‘పెదకాపు’ మూవీ ట్రైలర్ తో, టీజర్ తో అంచనాలు పెంచేశారు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. ఈ మూవీతో శ్రీకాంత్ అడ్డాల కేవలం ఫ్యామిలీ డైరెక్టర్ మాత్రమే కాదు యాక్షన్ కూడా అదరగొట్టగలడు అని ప్రూవ్ అవుతుందని సినీ విశ్లేషకులు భావించారు. కానీ తీరా సినిమాకెళ్తే ప్రేక్షకులకు నిరాశ తప్పలేదు. ఇక బ్రో, ఆది కేశవ, భోళాశంకర్ వంటి మెగా హీరోల సినిమాల్లోనూ ఇదే రిపీట్ అయింది. ఇంకేముందు ఈ ఏడాది మెగా హీరోలకు భారీ డిజాస్టర్లు తప్పలేదు. అలాగే ఆ మూవీ నిర్మాతలను భారీ నష్టాలూ తప్పలేదు.