Vijay : టాలీవుడ్ బడా బ్యానర్ లో దళపతి సినిమా!

కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్నేళ్లుగా వరుస సినిమాలతో హిట్ల మీద హిట్లు కొడుతున్న ఈ హీరో వరుస సినిమాల షూటింగ్ లతో బిజీ బిజీగా ఉన్నాడు. లాస్ట్ ఇయర్ పొంగల్ కి వారిసు, లియో సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన ఈ హీరో ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వం లో “గోట్” సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత ఏ సినిమా అన్నది అంతగా తెలీదు. ఎందుకంటే విజయ్ గత కొన్నాళ్లుగా ఒకదాని తర్వాత మరో సినిమా, అంటే ఒకటి ఫినిష్ అయ్యాకే మరో సినిమా చేస్తున్నాడు.

అయితే తాజాగా టాలీవుడ్ బడా బ్యానర్ అయిన డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ ఓ సినిమా చేస్తున్నాడని లేటెస్ట్ గా సమాచారం అందింది. మార్చ్ లేదా ఏప్రిల్ లో ఈ సినిమా ప్రారంభం కానున్నదట. అయితే ఈ సినిమా డైరెక్టర్ ఎవరూ అన్నది మాత్రం ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. ఇక లాస్ట్ ఇయర్ విజయ్ దిల్ రాజు నిర్మాణం లోనే వారిసు సినిమా చేయగా, ఆ సినిమాని టాలీవుడ్ డైరెక్టర్ వంశి పైడిపల్లి దర్శకత్వం వహించాడన్న సంగతి తెలిసిందే.

అలాగే డివివి బ్యానర్ లో వస్తున్న సినిమాను కూడా ఓ తెలుగు దర్శకుడే తీయనున్నాడని టాక్ నడుస్తుంది. అయితే వారిసు సినిమా పూర్తిగా తెలుగులో తీస్తున్నారని, విజయ్ తెలుగులోనే నటిస్తున్నాడని మేకర్స్ అన్నా, అప్పుడు అది జరగలేదు. మరి ఇప్పుడైనా విజయ్ డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తాడేమో చూడాలి. ఇక విజయ్ ప్రస్తుతం నటిస్తున్న గోట్ సినిమా ఈ ఇయర్ సమ్మర్ చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉండగా, డివివి ఎంటెర్టైన్మెంట్స్ తీసే సినిమా 2025 సంక్రాంతికి వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు