Tollywood: తెలుగు సినిమా ప్రేక్షకులు అంటేనే మంచోళ్ళు

తెలుగు సినీ ప్రేక్షకులు ఒక గొప్ప సినిమాకి బ్రహ్మరథం పట్టిన అంతగా ఇంకే సినిమా ప్రేక్షకులు కూడా ఒక సినిమాను ఆదరించరు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక గొప్ప సినిమా వచ్చిన, అది రీమేక్ ఫిలమైన, వేరే భాషకు చెందిన డబ్బింగ్ ఫిల్మైన ఆ సినిమాను హిట్ చేయటంలో ఏ మాత్రం వెనకాడకుండా ఉంటారు.

సినిమా అంటే తెలుగు సినిమా ప్రేక్షకులకు వాళ్ళ దైనందుకు జీవితంలో అది ఒక ఓదార్పు, అది ఒక ఆనందం, అది ఒక గెలుపు, అది ఒక మలుపు అనే ఆలోచనలో ఉంటారు. ఇంకా గట్టిగా మాట్లాడితే సినిమానే కొందరికి జీవితం. కొందరికి వ్యసనం. కొందరికి వ్యాపారం. అని కూడా చెప్పొచ్చు.

ప్రతి సంక్రాంతికి నాలుగైదు సినిమాలు రిలీజ్ అయినా కూడా తెలుగు ప్రేక్షకులు ప్రతి సినిమాని చూసి వాళ్లకు నచ్చిన సినిమాని మరోసారి చూసి ఆ సినిమాను భారీ విజయం వైపు నడిపిస్తారు. అలానే ఇప్పుడు దసరా కానుకగా మూడు సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి.
వంశీ దర్శకత్వంలో రవితేజ నటించిన “టైగర్ నాగేశ్వరరావు“.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న భగవంత్ కేసరి తో పాటు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న లియో సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతుంది.

- Advertisement -

అయితే తెలుగు ప్రేక్షకులు ఈ మూడు సినిమాలను ఆదరించడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. వాస్తవానికి చెప్పాలంటే భగవంత్ కేసరి సినిమా కంటే కూడా లియో సినిమాకి ఇక్కడ క్రేజ్ భారీగా ఉంది అని చెప్పొచ్చు. ఇంకా టైగర్ నాగేశ్వర విషయానికొస్తే థియేటర్లు కూడా మిగతా రెండు సినిమాలతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. సో వాస్తవానికి రెండు తెలుగు సినిమాలు కంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత లియో సినిమాకు తెలుగు ప్రేక్షకులు ఇస్తున్నారు.

భాషతో సంబంధం లేకుండా సినిమాని ప్రేమిస్తూ, తెలుగు సినిమా ప్రేక్షకులు సినిమాకి బ్రహ్మరధం పట్టిన అంతగా ఇంకే సినిమా ప్రేక్షకులు పట్టరు. అసలు తెలుగు సినిమా ప్రేక్షకులు అంటేనే మంచోళ్ళు. వాళ్లు ఒకటే కాదు అదే రోజు ఎన్ని సినిమాలు వచ్చిన సినిమాలు అన్నిటిని చూడడానికి రెడీగా ఉన్నారు. మంచి సినిమాని ఎంకరేజ్ చేయడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు