Taraka Ratna Birth Anniversary : సినిమా స్టోరీని తలపించే తారక రత్న లవ్ స్టోరీ… ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకుండానే…

నందమూరి స్టార్స్ లో ఒకరైన దివంగత స్టార్ తారక రత్న బర్త్ డే నేడు. 1983 ఫిబ్రవరి 22న జన్మించిన తారకరత్న నందమూరి కుటుంబం నుంచి హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి, మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్న ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసి మెప్పించిన ఈ హీరో ఇప్పుడు మన మధ్యన లేకపోయినా నందమూరి అభిమానుల గుండెల్లో మాత్రం సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈరోజు తారకరత్న బర్త్ యానివర్సరీ సందర్భంగా సినిమా స్టోరీని తలపించే విధంగా ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకుండానే పెద్దలను ఎదిరించి తారకరత్న లవ్ మ్యారేజ్ ఎలా చేసుకున్నాడు అన్న ఆసక్తికరమైన విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

తారకరత్న భార్య పేరు అలేఖ్య రెడ్డి. వీరిద్దరి లవ్ స్టోరీ తో ఏకంగా ఒక సినిమానే తీసేయొచ్చు. అలాంటి ట్విస్ట్ లున్న వీళ్ళ లవ్ స్టోరీ లోకి వెళ్తే… తారకరత్న చెన్నైలో చదువుతున్నప్పుడు అలేఖ్య రెడ్డి సిస్టర్ కి స్కూల్లో సీనియర్. ఆ తర్వాత ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా వీళ్ళిద్దరూ హైదరాబాద్ లో కలిశారు. ముందుగా మంచి ఫ్రెండ్స్ గా ఉన్న తారక్, అలేఖ్య ఆ తర్వాత నెమ్మదిగా ప్రేమలో పడ్డారు. ముందుగా తారక రత్ననే ప్రపోజ్ చేశారు. ఆయన ప్రపోజల్ కు ఎస్ ఆర్ నో చెప్పకుండా అలేఖ్య తన పేరెంట్స్ తో మాట్లాడమని సలహా ఇచ్చిందట.

అయితే సినిమా ఇండస్ట్రీలోని వారిపై మంచి అభిప్రాయం లేకపోవడంతో అలేఖ్య తల్లిదండ్రులు వీళ్ళ పెళ్లికి ఒప్పుకోలేదట. మరోవైపు నందమూరి ఫ్యామిలీ కూడా ఈ జంట పెళ్లికి తిరస్కరించారట. ఎందుకంటే అప్పటికే అలేఖ్య రెడ్డి పెళ్లి చేసుకుని విడాకులు కూడా తీసుకుంది. ఇరు కుటుంబాలు తారకరత్న, అలేఖ్య పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఆమె అంకుల్ విజయసాయి రెడ్డి సపోర్ట్ తో పెళ్లి చేసుకున్నారట. విజయ్ సాయి రెడ్డి భార్య చెల్లెలు కుమార్తె ఈ అలేఖ్య. 2012 ఆగస్టు 2న సంఘీ టెంపుల్ లో అలేఖ్య, తారకరత్న వివాహం జరిగింది. ఈ వివాహానికి అటు నందమూరి ఫ్యామిలీ గాని, ఇటు అలేఖ్య ఫ్యామిలీ గాని హాజరు కాలేదు.

- Advertisement -

వివాహమైన చాలా రోజుల వరకు నందమూరి ఫ్యామిలీ, అటు అలేఖ్య ఫ్యామిలీ ఈ జంటను దగ్గరకు చేర్చుకోలేదు. 2013లో తారకరత్న, అలేఖ్య దంపతులకు నిష్కా అనే పాప పుట్టింది. అప్పటికి కూడా వీళ్లు ఇరు కుటుంబాలకు దూరంగానే ఉన్నారు. అయితే పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత తారకరత్న బర్త్ డే సందర్భంగా అందరూ ఒకటైనట్టు అలేఖ్య రెడ్డి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు