Tamanna: ఒకటి హిట్టు ఒకటి ప్లాపు.. అయినా తనకి ఒరిగిందేంటి?

Tamanna:

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా చెరగని ముద్ర వేసిన మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు కెరీర్ లో ఎన్నడూ లేనంత డౌన్ అయింది. ముఖ్యంగా కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో ట్రోల్స్ ఆమెను వెంటాడుతున్నాయి. చేతిలో రెండు సినిమాలున్నా అవేమి పెద్దగా చెప్పుకోదగినవి కాదు. అయితే ఆగష్టు నెలలో మాత్రం తమన్నా చాలా ఆశలు పెట్టుకుంది. కానీ ఆ ఆశలు అడియాశలే అయ్యాయి.

అసలు విషయానికొస్తే తమన్నా గత కొన్నాళ్లుగా ఆఫర్లు లేక స్ట్రగుల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఇయర్ లో రెండు పెద్ద సినిమాలు ఉండడంతో మళ్ళీ పికప్ అవుతుందనుకుంది. ఆ సినిమాలే జైలర్, భోళా శంకర్. అయితే ఆగష్టు 10, 11న ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యి ఒకటి హిట్ అయ్యి, మరొకటి ప్లాప్ అయింది. అయితే తమన్నా కి ఈ రెండు సినిమాలు కూడా ఎందుకూ ఉపయోగపడలేదు. ఎందుకంటే ముందుగా జైలర్ విషయానికొస్తే, ఆ సినిమా సూపర్ హిట్ అయింది. రిలీజ్ కి ముందు జైలర్ లో తమన్నా హీరోయిన్ అని అందరు అనుకున్నారు.

కానీ ట్రైలర్ లో రజినీకి రమ్యకృష్ణ భార్య అని తెలిసాక తమన్నా హీరోయిన్ కాదని తేలిపోయింది. కనీసం ఒక ఇంపార్టెంట్ రోల్ అయినా ఉండవచ్చు అని అనుకుంటే, పాత కోసమే తమన్నా ని పెట్టినట్టయింది. పైగా తమన్నా ఉన్న ఆ పాటకూడా ట్రోల్ అయింది. ఇక భోళా శంకర్ లో తమన్నా హీరోయిన్ గా చేసినప్పటికీ సినిమా డిజాస్టర్ అవడంతో తమన్నాకి ఎందుకూ ఉపయోగపడలేదు. అదీ గాక తమన్నా కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ కీర్తి సురేష్ చెల్లి పాత్రకే వచ్చింది. అందుకని తమన్నాకి ఇది కూడా ఉపయోగపడలేదు.

- Advertisement -

ఈ విధంగా జైలర్, భోళా శంకర్ రెండు సినిమాలు తమన్నాకి ఏ విధంగానూ పేరు తీసుకురాలేకపోయాయి. మరి ఇకమీద పెద్ద సినిమాల్లో ఛాన్సులు వస్తాయో లేదో చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు