People Media Factory: మొత్తానికి పెద్ద ప్లానే వేశారు… ‘ ఈగల్ ‘ కోసం టార్గెట్ సెట్

సంక్రాంతి సీజన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా పరిశ్రమ కి సంక్రాంతి సీజన్ కీలకమని చెప్పొచ్చు. ఎందుకంటే మామూలు టైం లో కంటే కూడా సంక్రాంతి టైంలో రిలీజ్ అయిన సినిమాలకి రెవెన్యూ ఎక్కువగా ఉంటుంది. యావరేజ్ సినిమా కూడా అద్భుతమైన కలెక్షన్లను రాబడుతుంది. అదే సంక్రాంతికి ఒక హిట్ సినిమా పడితే ఆ సినిమాకు వచ్చే కలెక్షన్స్, ఆ సినిమా చేసే మార్కెట్ వేరే లెవెల్ లో ఉంటుందని చెప్పొచ్చు. ఇవన్నీ క్లారిటీగా తెలుసు కాబట్టి ప్రతి సంక్రాంతికి దిల్ రాజు తన బ్యానర్ నుంచి ఒక సినిమా ఉండేటట్లు ప్లాన్ చేసుకుంటారు.

కానీ ఈసారి మాత్రం దిల్ రాజు ప్లాన్ చేసిన ఫ్యామిలీ స్టార్ సినిమా సంక్రాంతికి రిలీజ్ కి కావడం లేదు. మామూలుగా రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ చేంజెర్ సినిమాని సంక్రాంతి కానుక రిలీజ్ చేద్దామని దిల్ రాజు ప్లాన్ చేశారు. కానీ ఆ సినిమా కూడా కొన్ని అనివార్య కారణాల వలన పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇకపోతే ఈ సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. విక్టరీ వెంకటేష్ నటించిన సైన్ధవ్. అక్కినేని నాగార్జున నటిస్తున్న నా సామిరంగా. తేజ నటిస్తున్న హనుమాన్. అలానే రవితేజ నటిస్తున్న ఈగల్ సినిమా కూడా ఈ సంక్రాంతికి రిలీజ్ కానుంది.

వీటన్నిటిని మించి గుంటూరు కారం సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ కానుంది. అయితే గుంటూరు కారం సినిమాకి ఇప్పటికే అద్భుతమైన బజ్ ఏర్పడింది. ఇకపోతే ఈగల్ సినిమాకి మంచి బజ్ క్రియేట్ చేసేలా ప్లాన్ చేసింది నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. 20వ తారీఖున ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది. అలానే ఈ సినిమా ట్రైలర్ ను సలార్ సినిమాకి అటాచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
సలార్ సినిమాకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకొని ఈ ట్రైలర్ వదిలితే ఈగల్ సినిమాకి మరింత బజ్ క్రియేట్ అవుతుందని నిర్మాణ సంస్థ ఊహిస్తుంది. ఏదేమైనా ఇదొక మంచి ప్లాన్ అని చెప్పొచ్చు. రవితేజ నటిస్తున్న ఈగల్ సినిమాకి ఈ సినిమాకి కార్తీక్ ఘట్టంనేని దర్శకత్వం వహిస్తున్నారు

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు