Rashmika : కోలీవుడ్ లో భారీ ఛాన్స్ ?

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ఫుల్ బిజీగా గడుపుతుంది. మూడు భాషల్లో చేతి నిండా సినిమాలను లైన్ లో పెట్టుకుంది. బాలీవుడ్ లో ఇప్పటికే మిషన్ మజ్ను, గుడ్ బై షూటింగ్ లను పూర్తి చేసింది. అలాగే, యానిమల్ సినిమాలో నటిస్తుంది. తెలుగులో సీతా రామం తో పాటు పుష్ప ది రూల్ లిస్ట్ లో ఉన్నాయి. ఇక కోలీవుడ్ లో విజయ్ దళపతితో వారసుడు అనే సినిమా చేస్తుంది.

ఇప్పటికే చేతి నిండా సినిమాలు ఉన్న రష్మిక మందన్నాకు మరో బంపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరో చియన్ విక్రమ్ 61వ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయిందట. విక్రమ్ కెరీర్ లో 61వ సినిమా పా రంజిత్ దర్శకత్వంలో వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటి కే అధికారిక ప్రకటన వచ్చింది.

ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం చిత్ర బృందం కొంత మంది పేర్లను పరిశీలించారట. చివరికి రష్మిక మందన్నా ను ఫైనల్ చేశారని టాక్. రష్మిక ను ఎంపిక చేయడానికి కారణం లేకపోలేదు. తెలుగు, తమిళ, హిందీ భాష ప్రేక్షకులకు ఈ హీరోయిన్ సుపరిచితం. ఎవరో కొత్త హీరోయిన్ కాకుండా, అందరికీ తెలిసిన భామను తీసుకోవాలని మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. దీనిపై చిత్ర బృందం త్వరలోనే అధికారిక ప్రకటన వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు