Radhana Ram : రెండో సినిమాకే..

అక్కినేని నట వారసుడు నాగ చైతన్య వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇటీవల నాగ చైతన్య బాలీవుడ్ లో లాల్ సింగ్ చడ్డా తో అరగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. కానీ నాగ చైతన్య నటనకు మాత్రం ప్రశంసలు వచ్చాయి. అలాగే ఈ ఏడాదిలో వచ్చిన బంగర్రాజు మంచి విజయం నమోదు చేసుకోగా, థాంక్యూ మాత్రం పరాజయం పాలైంది. దీంతో నాగ చైతన్య తర్వాత వచ్చే సినిమాలపై ఫోకస్ పెట్టారు.

నాగ చైతన్య ప్రస్తుతం తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో ఒక సినిమా చేస్తున్నారు. దీంతో పాటు సర్కారు వారి పాటతో ఇటీవల మంచి గుర్తింపు తెచ్చుకున్న పరశురామ్ తో మరో చిత్రం చేయనున్నారు. ఇప్పటికే స్టోరీకి సంబంధించిన చర్చలు ముగియడంతో స్క్రిప్ట్ పనులను పరశురామ్ చూసుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ చిత్రం గురించి ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ లో ఒక వార్త వినిపిస్తుంది. కన్నడ చిత్ర పరిశ్రమలో ఎక్కువగా కనిపించిన సీనియిర్ హీరోయిన్ మాలాశ్రీ కూతురు రాథనా రామ్ ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడిగా కనిపించబోతుందని సమాచారం అందుతుంది.

రాథనా రామ్ ఇప్పటికే కన్నడ హీరో దర్శన్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. రెండో సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టాలని చూస్తుందని తెలుస్తుంది. నాగ చైతన్య సినిమాలో రాథనా రామ్ హీరోయిన్ గా దాదాపు ఖరారు అయినట్లు టాక్. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందట. ఇదిలా ఉండగా తెలుగులో విక్టరీ వెంకటేష్ తో సాహస వీరుడు సాగర కన్య చిత్రంలో హీరోయిన్ గా సీనియిర్ హీరోయిన్ మాలా శ్రీ నటించిన సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు