Priyanka Chopra: గొడ్డు మాసం వల్లనే బాలీవుడ్ కు దూరమయ్యాను

Priyanka Chopra

బాలీవుడ్ స్టార్ హీరోలతో పలు సూపర్ హిట్ సినిమాలలో నటించిన ప్రియాంక చోప్రా హిందీ ఇండస్ట్రీ వదిలేసి ప్రస్తుతం హాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే బాలీవుడ్ బడా హీరోయిన్స్ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉండగానే ప్రియాంక చోప్రా బాలీవుడ్ ను వదిలేసి హాలీవుడ్ కు వెళ్లడం అందరిని ఆశ్చర్య పరిచింది ఇక లేటెస్ట్ గా చూస్తే ఆమె నిజానికి హాలీవుడ్ వెళ్ళడానికి గతంలో జరిగిన ఒక తంతు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

గతంలో డాక్స్ షెపర్డ్‌కి అనే హాలీవుడ్ నటుడు నిర్వహించే ఒక షో కి ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రియాంక చోప్రా తాను బాలీవుడ్ కు దూరమైపోవడానికి గల కారణాన్ని వివరించింది. తను బాలీవుడ్ సినిమాలు చేస్తున్న సమయంలో పార్టీలకు వెళ్ళవలసి వచ్చేదని అక్కడ తనను కొంతమంది గొడ్డు మాంసం తినమని ఫోర్స్ చేసేవారని ఆమె చెప్పింది. గొడ్డు మాసం తినడం తనకు ఇష్టం లేకపోయేదని వివరిస్తూ.. బాలీవుడ్ లో ఉన్న రాజకీయాలు తనకు నచ్చలేదని, ఆ రాజకీయాలు చూసి విసిగిపోయి బాలీవుడ్ ను కావాలనే దూరం పెట్టానని ఆమె చెప్పుకొచ్చింది.

అయితే ఈ ఇంటర్వ్యూ జరిగి నిజానికి సంవత్సరం గడుస్తుంది. అయితే ఈ ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తరువాత ప్రియాంక మాటలు ఒక ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ ను ఉద్దేశించి ఆమె మాట్లాడిందని అప్పట్లో చర్చలు జరిగాయి. ఇక లేటెస్ట్ గా చూస్తే ఒక ఫంక్షన్ లో ప్రియాంక చోప్రా వ్యాఖ్యలకు కారణమైన ఆ బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ మరియు ప్రియాంక చోప్రా కలివిడిగ ఉండటంతో మరోసారి ప్రియాంక చోప్రా గొడ్డు మాసం కాంట్రవర్సీ బయటకు వచ్చింది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు